Somesekhar
కేరళలో నెలకొన్న భారీ విపత్తు వేళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు విశ్వనటుడు కమల్ హాసన్.
కేరళలో నెలకొన్న భారీ విపత్తు వేళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు విశ్వనటుడు కమల్ హాసన్.
Somesekhar
కేరళలో జూలై 29 నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఊర్లు మెుత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే వందల మంది తమ ప్రాణాలను విడిచారు. మరీ ముఖ్యంగా ఈ వరదల కారణంగా వయనాడ్ ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ భారీ విపత్తు వేళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు విశ్వనటుడు కమల్ హాసన్.
కేరళను గత కొన్ని రోజుల నుంచి వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే 320 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 250 మందికి పైగా ఆచూకి లభ్యం కాలేదు. వారి కోసం రాడార్ సిస్టమ్ ను ఉపయోగిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ భారీ విపత్తు వేళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ గొప్ప మనసును చాటుకుంటూ.. భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ సూర్య ఫ్యామిలీ కేరళ వరద బాధితుల కోసం రూ. 50 లక్షల భారీ విరాళం ప్రకటించింది. తాజాగా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ వయనాడ్ వరద బాధితులకు రూ. 25 లక్షలు ప్రకటించారు. ఈ మెుత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
ఈ విపత్తు చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ఈ సందర్భంగా కమల్ చెప్పుకొచ్చాడు. ఇక కమల్ హాసన్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరు అనేకసార్లు భేటీ అయ్యారు. చియాన్ విక్రమ్ రూ. 20 లక్షలు, రష్మిక మందన్న రూ. 10 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 35 లక్షలు ప్రకటించాడు.అలాగే మాలీవుడ్ కపుల్ పహాద్ ఫజిల్, నజ్రియా కూడా రూ. 25 లక్షలు అందించారు. మరి వయనాడ్ వరద బాధితులకు కమల్ హాసన్ రూ. 25 లక్షల భారీ విరాళం ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.