iDreamPost
android-app
ios-app

దారుణంగా పడిపోయిన ఇండియన్ 2 డే 2 కలెక్షన్స్.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కష్టమే!

  • Published Jul 14, 2024 | 12:52 PM Updated Updated Jul 14, 2024 | 12:52 PM

Indian 2 Day2 Collections: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు.. భారీ షాక్ ఏ తగిలింది. కలెక్షన్స్ విషయంలో కూడా డీలా పడినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి రెండవ ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూసేద్దాం.

Indian 2 Day2 Collections: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు.. భారీ షాక్ ఏ తగిలింది. కలెక్షన్స్ విషయంలో కూడా డీలా పడినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి రెండవ ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూసేద్దాం.

  • Published Jul 14, 2024 | 12:52 PMUpdated Jul 14, 2024 | 12:52 PM
దారుణంగా పడిపోయిన ఇండియన్ 2 డే 2 కలెక్షన్స్.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కష్టమే!

భాతీయుడు 2 సినిమా భారీ అంచనాల మధ్యన.. జూలై 12 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాకు ఊహించిన రేంజ్ లో భారీ షాక్ ఎదురైందని చెప్పి తీరాల్సిందే. 1996 లో వచ్చిన భారతీయుడు మూవీ భారీ హిట్ కావడంతో.. అందులోను దాదాపు రెండు దశాబ్దాల తర్వాత.. అలాంటి ఓ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమాకు.. సిక్వెల్ అంటే.. ప్రతి ఒక్కరు సినిమాపై అంచనాలు పెంచుకోవడం సహజం. కానీ ఎందుకో ఈ సిక్వెల్ ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఇక మొదటి రోజు బజ్ తక్కువే ఉన్నపటికీ కూడా డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టింది. కానీ రెండవ రోజు కలెక్షన్స్ విషయం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

భారతీయుడు 2 మూవీ.. మొదటి రోజు కలెక్షన్స్ చూసినట్లయితే.. తెలుగు స్టేట్స్ మొదటి రోజు 9నుంచి 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా.. డే వన్ లో రూ. 43.8 కోట్లు కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది ఈ మూవీ. ఇక వీకెండ్ అయినా కలెక్షన్స్ ఏమైనా మారుతాయి అని ఆశ పడిన మూవీ టీమ్ కు నిరాశ ఎదురైంది. మొదటి రోజు కంటే కూడా రెండవ రోజు కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. తమిళనాడు నుంచి 13.7 కోట్లు , హిందీ నుంచి 1.3 కోట్లు, తెలుగు నుంచి రూ. 3.2 కోట్ల కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. అంటే మొత్తంగా భారతీయుడు 2 మూవీ రెండవ రోజు కలెక్షన్స్ రూ. 18.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 56.25 కోట్ల షేర్, రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు .. ట్రేడ్ వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమాకు రెండు తెలుగు స్టేట్స్ లో రూ. 24 కోట్ల బిజినెస్ కాగా.. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కష్టమే అని అనుకుంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియన్ 2 మూవీకి రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 172 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ . సో బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే.. 120 కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సిందే. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాపై వస్తున్న టాక్ ను దృష్టిలో ఉంచుకుని.. ప్రేక్షకుల కోసం మేకర్స్.. మూవీ రన్ టైమ్ ను కూడా తగ్గించారు. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş