iDreamPost
android-app
ios-app

Kamal Haasan: కమల్ గొప్ప మనస్సు.. బిగ్ బాస్ టీమ్ కి విందు భోజనం!

  • Published Jan 16, 2024 | 11:40 AM Updated Updated Jan 16, 2024 | 11:40 AM

బుల్లి తెర ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత, ఆ సీజన్ హోస్ట్.. హౌస్ మేట్స్ అందరికి సంక్రాంతి పండుగ సంధర్భంగా ఘనంగా లంచ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బుల్లి తెర ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత, ఆ సీజన్ హోస్ట్.. హౌస్ మేట్స్ అందరికి సంక్రాంతి పండుగ సంధర్భంగా ఘనంగా లంచ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jan 16, 2024 | 11:40 AMUpdated Jan 16, 2024 | 11:40 AM
Kamal Haasan: కమల్ గొప్ప మనస్సు.. బిగ్ బాస్ టీమ్ కి  విందు భోజనం!

అటు వెండితెర మీద మంచి పేరు సంపాదించుకున్న ఎంతో మంది టాప్ హీరోలు.. అప్పుడపుడు ఇటు బుల్లితెర మీద కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ముందు ఉండేది బిగ్ బాస్. ఇటు తెలుగులోనూ అటు మిగతా భాషల్లోనూ ఈ ప్రోగ్రామ్ మంచి రేటింగ్ ను సంపాదించుకుంది. మొదటి నుంచి ఈ రియాలిటీ షోకి ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలే హోస్ట్ లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళంలో బిగ్ బాస్ సీజన్ 7 కు ఎండ్ కార్డు పడింది. ఈ సీజన్ కు నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. అయితే, ఈ సీజన్ లో పాల్గొన్న ఇంటి సభ్యులకు లంచ్ ఏర్పాటు చేశారు కమల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి.

తమిళ బిగ్ బాస్ సీజన్ 7.. జనవరి 14న ముగిసింది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వీజే అర్చన టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఈ క్రమంలో సీజన్ ను సక్సెఫుల్ గా కంప్లీట్ చేసిన హౌస్ మేట్స్ కు, బిగ్ బాస్ టీమ్ కు.. ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన కమల్ హాసన్ ఘనంగా విందు ఏర్పాటు చేశారు. అందులోను పండుగ రోజున సీజన్ ముగియడంతో.. వారికీ ప్రత్యేకంగా పండుగ స్పెషల్స్ ను విందులో పెట్టించారు కమల్. అందరికి రకరకాల ఆహార పదార్ధాలను కడుపు నిండా వడ్డించి.. వ్వావ్ అనిపించుకున్నారు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత.. అక్కడికే వారి బాధ్యత పూర్తి అయిపోయిందనుకుంటారు అంతా. కానీ, కమల్ హాసన్ మాత్రం కాస్త భిన్నంగా పండుగ రోజున.. బయటకు వచ్చిన హౌస్ మేట్స్ కు , మొత్తం బిగ్ బాస్ టీమ్ కు పండుగ పూట విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సామజిక మాద్యమాలలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కమల్ ను ప్రశంసల వర్షంతో ముంచేస్తున్నారు.

kamal hasan great

ఇక కమల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాలలో భారీ తారాగణం ముఖ్య పాత్రలుగా నటిస్తున్నట్లు సమాచారం. థగ్ లైఫ్ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. వీటితో పాటు హెచ్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమా, డైరెక్టర్ అన్ భైరవ్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న చిత్రంలోనూ.. కమల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇలా వరుస చిత్రాలతో కమల్ హాసన్ బిజీ బిజీగా ఉన్నారు. ఏదేమైనా, అటు వెండితెరపైన బిజీగా ఉంటూ కూడా.. ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. బిగ్ బాస్ టీమ్ కు ప్రత్యేక విందును ఏర్పాటు చేసి .. అందరి చేత గ్రేట్ అనిపించుకుంటున్నారు కమల్. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio