iDreamPost
android-app
ios-app

Kalyani Priyadarshan: ఒళ్లు హూనం చేసుకుంటున్న కళ్యాణి ప్రియదర్శన్..ఇంత రిస్క్ అవసరమా..?

  • Published Dec 04, 2023 | 4:51 PM Updated Updated Dec 04, 2023 | 4:51 PM

హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మాలీవుడ్ భామ కళ్యాణి ప్రియదర్శిన్. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ సినిమాలు చేయలేదు. మలయాళంలో హృదయం, బ్రోడాడీ వంటి చిత్రాలతో హిట్ కొట్టి.. వరుస ఆఫర్లను అందుకుంది.. అయితే తాజాగా ఆమె చేసిన పోస్టు..

హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మాలీవుడ్ భామ కళ్యాణి ప్రియదర్శిన్. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ సినిమాలు చేయలేదు. మలయాళంలో హృదయం, బ్రోడాడీ వంటి చిత్రాలతో హిట్ కొట్టి.. వరుస ఆఫర్లను అందుకుంది.. అయితే తాజాగా ఆమె చేసిన పోస్టు..

  • Published Dec 04, 2023 | 4:51 PMUpdated Dec 04, 2023 | 4:51 PM
Kalyani Priyadarshan: ఒళ్లు హూనం చేసుకుంటున్న కళ్యాణి ప్రియదర్శన్..ఇంత రిస్క్ అవసరమా..?

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజీల కుమార్తె కళ్యాణి ప్రియదర్శిన్ తెలుగులో చేసినవి మూడే సినిమాలు అయినా.. అందరి హృదయాల్లో గుర్తుండిపోతుంది. మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ.. సినీ కెరీర్ స్టార్ చేసింది మాత్రం టాలీవుడ్ తోనే. హలో, రణరంగం, చిత్రలహరి వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత నుండి తెలుగు పరిశ్రమ వైపు చూడటం లేదు. మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా మాలీవుడ్ ప్రముఖ హీరో జోజూ జార్జ్ హీరోగా తెరకెక్కిన మూవీ ఆంటోనీలో నటించింది. డిసెంబర్ 1న విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులో ఆమెకు గాయాలైనట్లు స్పష్టమౌతోంది. ఇంతకు ఏం జరిగిందీ..

తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకున్న కళ్యాణీ.. ఇలా రాసుకొచ్చింది. ‘ కంఫర్ట్ జోనులో ఉన్నంత సేపు ఎదగలేం. అలాగే గ్రోత్ జోనులో ఉన్నా సంతృప్తి ఉండదు. ఆ విషయం నాకు ఆలస్యంగా అర్ధమైంది. నేను తిన్న పంచ్‌లు నిజమే. ఆ కిక్స్ రియలే, దెబ్బలు తగలడం నిజమే. కన్నీళ్లు, ఆ నవ్వులు నిజం. అయితే ఆ రక్తం మాత్రం నిజం కాదూ. ఆంటోని మూవీ విడుదలైంది. మీ చప్పట్లు నాకు ఎంతో బలాన్ని అందించాయి. ఆ అరుపులు ఆనందాన్ని ఇచ్చాయి. సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె బాక్సర్ గా కనిపించింది. ఈ మూవీ కోసం ఆమె బాగా కష్టపడినట్లు కనిపిస్తోంది. ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో గాయాలు అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.

బాక్సర్‌గా కనిపించేందుకు కసరత్తులు బాగా చేసినట్లు తెలుస్తోంది. ఒళ్లంతా హూనం చేసుకుని.. చెమటోడ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ రావడంతో ఆ కష్టాన్ని మర్చిపోయి.. అభిమానులకు ధాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. ఆమె పోస్టుకు మరో మలయాళ ముద్దుగుమ్మ, టాలీవుడ్ మహా నటి కీర్తి సురేష్ టూ గుడ్ అంటూ రిప్లై ఇచ్చింది. కళ్యాణి ప్రియదర్శిన్ ముచ్చటగా మూడు సినిమాలు చేసింది తెలుగులో. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని కన్నెత్తి చూడటం లేదు. అవకాశాలు రావడం లేదో లేక కోలీవుడ్, మాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కావడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీని లైట్ తీసుకుందో అర్థం కావడం లేదు.  తెలుగు ఇండస్ట్రీ వైపు ఈ అందం తిరిగి ఎప్పుడు చూస్తుందో తెలియాల్సి ఉంది. మరీ ఆమె తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet