iDreamPost
android-app
ios-app

Nandamuri Kalyan Ram: నీకు యాక్టింగ్ అవసరమా? అని అవమానించారు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!

  • Published Dec 24, 2023 | 11:35 AM Updated Updated Dec 24, 2023 | 11:35 AM

ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సక్సెస్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానంటూ సుమ అడ్డా షోలో చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఇక ఈ షోలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సక్సెస్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానంటూ సుమ అడ్డా షోలో చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఇక ఈ షోలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

  • Published Dec 24, 2023 | 11:35 AMUpdated Dec 24, 2023 | 11:35 AM
Nandamuri Kalyan Ram: నీకు యాక్టింగ్ అవసరమా? అని అవమానించారు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!

నందమూరి కళ్యాణ్ రామ్.. జయాపజయాలతో సంబంధంలేకుండా, విభిన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. మిగిలిన హీరోల కంటే భిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా.. కొత్త కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిల్ రావిపూడిని ‘పటాస్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సక్సెస్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానంటూ సుమ అడ్డా షోలో చెప్పుకొచ్చారు. ఇక షోలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు కళ్యాణ్ రామ్.

సుమ అడ్డా షోలో సందండి చేశారు ‘డెవిల్’టీమ్. నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటుగా హీరోయిన్ సంయుక్త మీనన్ తన టీమ్ తో సుమ షోలో అభిమానులను అలరించారు. ఇక ఈ ఎపిసోడ్ లో సుమతో కలిసి కళ్యాణ్ రామ్ చేసిన అల్లరి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ క్రమంలోనే షోలో తన తండ్రి హరికృష్ణకు తలచుకుని ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ రామ్. దీంతో పాటుగా తన కెరీర్ తొలి రోజుల్లో పడ్డ కష్టాలను, అవమానాలను గుర్తు చేసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో అతడు హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంత కష్టపడ్డాడో మనందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ షోలో చెప్పుకొచ్చారు. “కెరీర్ స్టార్టింగ్ లో నా చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో నీకు యాక్టింగ్ అవసరమా? ఇండస్ట్రీ నుంచి వెళ్లిపో అంటూ అవమానించారు. కానీ నాన్నగారు మాత్రమే అవన్నీ పట్టించుకోకు.. నువ్వు ముందుకు సాగు అంటూ ఉత్సాహపరిచారు” అంటూ ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

కాగా.. కళ్యాణ్ రామ్ ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అభిమన్యుతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో అందరూ తనను విమర్శించి, నీకు యాక్టింగ్ అవసరమా? యాక్టింగ్ మానేయ్ అంటూ అవమానించారని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. కాగా.. బింబిసార మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన లేటెస్ట్ గా నటించిన ‘డెవిల్’ మూవీ డిసెంబర్ 29న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో.. మూవీపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. దీంతో బింబిసార రేంజ్ లో డెవిల్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet