క్లీంకారకు ప్రభాస్ 'కల్కి' గిఫ్ట్! ఉపాసన పోస్ట్ వైరల్..

క్లీంకారకు ప్రభాస్ ‘కల్కి’ గిఫ్ట్! ఉపాసన పోస్ట్ వైరల్..

రామ్ చరణ్-ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీంకారకు 'కల్కి' టీమ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

రామ్ చరణ్-ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీంకారకు 'కల్కి' టీమ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

‘కల్కి 2898 AD’ ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణె, దుల్కర్ సల్మాన్ లాంటి భారీ తారాగాణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కల్కి మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను గ్రాండ్ గా ప్లాన్ చేసింది మూవీ టీమ్. అందులో భాగంగానే రామ్ చరణ్-ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీంకారకు ‘కల్కి’ టీమ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే?

రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు క్లీంకారకు పుట్టిన దగ్గర నుంచి సెలబ్రిటీల నుంచి రకరకాల బహుమతులు వస్తూనే ఉన్నాయి. బన్నీ, శర్వానంద్, ఎన్టీఆర్ లతో పాటుగా మరికొందరు ఈ మెగా ప్రిన్సెస్ కు బహుమతులు పంపించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి కల్కి టీమ్ కూడా చేరింది. బుజ్జీ-భైరవ క్యారెక్టర్స్ తో పిల్లల్లోనూ మూవీపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా బుజ్జి బొమ్మలను, భైరవ స్టిక్కర్లను, టీ షర్ట్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. వాటిని విక్రయించడమే కాకుండా.. సెలబ్రిటీల పిల్లలకు బహుమతులుగా పంపి.. సినిమాపై ఆసక్తిని పెంచుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూతురు క్లీంకారకు బుజ్జి బొమ్మతో పాటుగా మరికొన్ని గిఫ్ట్ లు కల్కి మూవీ టీమ్ పంపించింది. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోలను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. “థ్యాంక్స్ కల్కి టీమ్.. ఆల్ ది బెస్ట్” అంటూ క్లీంకార ఆడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. బుజ్జి-భైరవ క్యారెక్టర్స్ తో కల్కి టీమ్ ప్రేక్షకుల్లో హైప్ ను తీసుకొస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన కల్కికి  రూ. 600 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. మరి పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ.. సరికొత్త పబ్లిసిటీతో దూసుకెళ్తున్న కల్కి టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments