కల్కి దెబ్బకి RRR రికార్డ్స్ అవుట్! సింగిల్‌గా వచ్చి రెబలోడు కుమ్మేశాడు!

Kalki 2898 AD Broke RRR Records.. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా డార్లింగ్ ప్రభాస్ కే చెల్లిందని మరోసారి నిరూపితమైంది. ఇప్పటి వరకు రాజమౌళికే సాధ్యం అనుకుంటున్న రేర్ ఫీట్ ను తన సినిమాలతో టచ్ చేశాడు యంగ్ రెబల్ స్టార్.

Kalki 2898 AD Broke RRR Records.. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా డార్లింగ్ ప్రభాస్ కే చెల్లిందని మరోసారి నిరూపితమైంది. ఇప్పటి వరకు రాజమౌళికే సాధ్యం అనుకుంటున్న రేర్ ఫీట్ ను తన సినిమాలతో టచ్ చేశాడు యంగ్ రెబల్ స్టార్.

రికార్డులు సృష్టించాలన్నా, తన రికార్డులు తానే తిరగరాయాలన్న అది ప్రభాస్‌కే సాధ్యం అనిపించేలా మారింది. బాక్సాఫీసును తన సినిమాలతో షేక్ చేయడమే కాదు.. వసూళ్ల మోత మోగిస్తున్నాడు. ఎవరికీ సాధ్యం కానీ రేర్ ఫీట్లు కొల్లగొడుతున్నాడు. పాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ మూవీతో కూడా మరోసారి ఇది నిరూపితమైంది. సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుని.. తన స్టామినా ఏంటో బాలీవుడ్‌కే కాదు హాలీవుడ్‌కు కూడా చూపిస్తున్నాడు. మైథాలజీ స్టోరీని తనదైన స్టైల్లో తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. వారం రోజుల్లో రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది కల్కి. వెయ్యి కోట్ల దిశగా దూసుకెళుతుంది. ఇదిలా ఉంటే ఇక్కడే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతుంది.

ఇండియాలోనే కాదు నార్త్ అమెరికాలో రికార్డుల మోత మోగిస్తోంది కల్కి . విడుదల ముందు నుండే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీమియర్ ప్రీ సేల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే ఫాస్టెట్ 100 కోట్లు దాటిన మూవీగా, అత్యధిక గ్రాసర్ మూవీగా నిలించింది. ఇండియన్ బాక్సాఫీసునే కాదు.. అమెరికా బాక్సాఫీసును బద్దలు కొడుతున్నాడు ఈ పాన్ ఇండియన్ మోస్ట్ ఎలిజబెల్ బ్యాచ్ లర్. ఈ వారం రోజుల్లో అమెరికాలో 14.5 మిలియన్ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 115 కోట్లు. సాధారణంగా ఓవర్సీస్‌లో తెలుగు సినిమాకు మిలియన్ డాలర్స్ వస్తే.. అదొక క్రెడిటబులిటీ. ఇప్పుడు కల్కి.. 14.5 మిలియన్ కలెక్ట్ చేయగా.. ఇంకా హవా కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ కల్కి ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది.  తన సినిమాలతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు ప్రభాస్. అమెరికాలో తెలుగులో అత్యధిక కలెక్షన్లు వసూలు చిత్రంగా బాహుబలి 2 మొదటి స్థానంలో నిలుస్తుంది. 20 మిలియన్ డాలర్లను వసూలు చేసింది బాహుబలి 2. ఆ తర్వాత RRR 14.3 డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ ప్లేసును కల్కితో రీ ప్లేస్ చేశాడు ప్రభాస్. ఇప్పుడు సెకండ్ ప్లేసులోకి కల్కి వచ్చింది. ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్. ఇక అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 టాలీవుడ్ చిత్రాల్లో ఐదు సినిమాలు డార్లింగ్‌వే కావడం గమనార్హం. బహుబలి 2, కల్కి, సలార్, బాహుబలి 1, సాహో నిలిచాయి. అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెద్దదే. ఇక్కడ బీ గ్రేడ్ హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అలాగే స్టార్ హీరోలు, దర్శకుల చిత్రాలకు కూడా ఓ రేంజ్ బిజినెస్ జరుగుతుంది.

Show comments