Kalki 2898 AD OTT: కల్కి OTT పార్టనర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Kalki 2898 AD OTT Platform: మూవీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కల్కి చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో కల్కి ఓటీటీ రైట్స్‌ ఎవరు దక్కించుకున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..

Kalki 2898 AD OTT Platform: మూవీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కల్కి చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో కల్కి ఓటీటీ రైట్స్‌ ఎవరు దక్కించుకున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..

మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న కల్కి 2898 ఏడీ సినిమా నేడు వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచే కల్కి షోలు మొదలయ్యాయి. అర్థరాత్రి నుంచి థియేటర్ల వద్ద అభిమానులు సందడి మొదలైంది. ఇక నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. భారత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే ‘కల్కి’ అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగ్ అశ్విన్.

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో.. అద్భుతమైన సాంకేతికతతో.. భారీతారాగణంతో.. సుమారు నాలుగున్నరేళ్ల పాటు కష్టపడి కల్కి సినిమాను తెరకెక్కించారు. చివరకు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌తో పాటు.. అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో.. కల్కి సినిమా ఎలా ఉందో ట్విట్టర్ వేదిగా అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. థియేటర్లలో డార్లింగ్‌ ప్రభాస్‌ ఊచకోత కోస్తున్నాడని.. తెలుగోడి సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియజేశారని.. విజువల్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ లాంటి కటౌట్‌కు కరెక్ట్‌గా సరిపోయే పాత్ర కల్కి అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

కల్కి టాక్‌ అలా ఉంచితే.. మన దేశంలో ఇప్పుడు ఓటీటీల హవా పెరిగింది. ఎంత భారీ బడ్జెట్‌ చిత్రం అయినా.. ఎంతటి ఘన విజయాన్ని సాధించిన చిత్రమైనా సరే.. ఓటీటీల్లోకి రావాల్సిందే. ఒకప్పుడైతే.. సినిమా చూస్తే థియేటర్‌లో చూడాలి.. లేదంటే టీవీలో వచ్చే వరకు ఆగాలి. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. థియేటర్‌లో అయిపోయిన తర్వాత ఆ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దాంతో ఎప్పుడు కావాలంటే.. అప్పుడు.. సినిమా చూడొచ్చు. ఇక కల్కి చిత్రం కూడా ఓటీటీలోకి రావాల్సిందే.

ఇక కల్కి విడుదలకు ముందు నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయి. దాంతో ప్రీరిలీజ్‌బిజినెస్‌ కూడా భారీ ఎత్తునే జరిగిందనే సమాచారం. ఈ క్రమంలో కల్కి ఓటీటీ రైట్స్‌ దక్కించుకోవడం కోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడ్డాయి. చివరకు అమెజాన్‌ ప్రైమ్‌ కల్కి ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఇందుకోసం అమెజాన్‌ భారీ మొత్తంలో చెల్లించనట్లు తెలుస్తోంది. ఇక సాధారణంగా సినిమా రిలీజ్‌ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ కల్కి భారీ బడ్జెట్‌ చిత్రం.. ఇప్పట్లో పోటీకి ఏసినిమాలు కూడా లేవు కనుక.. కల్కి ఓటీటీ రిలీజ్‌ ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Show comments