iDreamPost

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీపిక ధరించిన బ్రేస్ లెట్ అంత ఖరీదా? లక్షల్లో కాదు ఏకంగా..

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తన చేతికి ధరించిన వజ్రాల బ్రేస్ లెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ బ్రేస్ లెట్ ధరెంతో తెలుసా?

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తన చేతికి ధరించిన వజ్రాల బ్రేస్ లెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ బ్రేస్ లెట్ ధరెంతో తెలుసా?

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీపిక ధరించిన బ్రేస్ లెట్ అంత ఖరీదా? లక్షల్లో కాదు ఏకంగా..

సెలబ్రిటీలు ఏదైనా ఫంక్షన్స్ కు వెళ్తే.. అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం స్పెషల్ గా డిజైన్ చేసుకున్న డ్రెస్సులతో పాటుగా ధగధగా మెరిసే బంగారాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని ధరిస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు సినిమా ఫంక్షన్స్ లో ధరించే నగలు వేడుకకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక వాటి ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ దీపికా పదుకొణె తన చేతికి ధరించిన వజ్రాల బ్రేస్ లెట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాని ధర ఎంతో తెలుసా?

‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో ఘనంగా నిర్వహించారు. ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఇక బేబీ బంప్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దీపికా. ఆమె స్టేజ్ పైకి వస్తుంటే.. బిగ్ బీ చేయి అందివ్వగా.. ప్రభాస్ కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టాడు. ఇక ఈ వేడుకకు దాదాపు అందరూ బ్లాక్ డ్రెస్ లోనే వచ్చారు. డార్లింగ్ ప్రభాస్ తనదైన శైలిలో నవ్వించాడు. ఇదిలా ఉండగా.. ఈ వేడుకలో దీపిక తన ఎడమ చేతికి ధరించిన వజ్రాల బ్రేస్ లెట్ ప్రత్యేకంగా నిలిచింది. ఫంక్షన్ కు వచ్చిన అతిథులతో పాటుగా అభిమానులు చూపు కూడా దానిపైనే ఉంది.

అయితే అది చిన్నాచితకా బ్రేస్ లెట్ కాదు. దాని ధర అక్షరాలా రూ. 1.16 కోట్లని తెలుస్తోంది. సింపుల్ గా ఉన్న ఈ ఆభరణం.. దీపిక అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది. భారీ క్యాస్టింగ్ తో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి జూన్ 27న తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 

View this post on Instagram

 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి