Kalki 2898 AD Movie Censor Review: కల్కి సెన్సార్ రివ్యూ.. బొమ్మ హాలీవుడ్ రేంజ్ అంటూ..!

కల్కి సెన్సార్ రివ్యూ.. బొమ్మ హాలీవుడ్ రేంజ్ అంటూ..!

Kalki 2898 AD Movie Runtime And Censor Review: కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ఇప్పుడు సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. మరి.. ఆ సెన్సార్ రివ్యూలో మూవీ గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు.

Kalki 2898 AD Movie Runtime And Censor Review: కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ఇప్పుడు సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. మరి.. ఆ సెన్సార్ రివ్యూలో మూవీ గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు.

వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కల్కి 2898 ఏడీ అనే చెప్పాలి. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా అభిమానులు అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ అన్నీ మూవీపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోపై ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ మేకర్స్, క్రిటిక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. తాజాగా కల్కి సినిమా సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. ఆ రివ్యూ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రభాస్- నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు, క్యారెక్టర్ రివీలింగ్, టీజర్, ట్రైలర్, బుజ్జి అండ్ భైరవ మానిమేషన్ సిరీస్, ప్రీల్యూడ్ వీడియోలు అంటూ చాలానే అప్ డేట్స్ వచ్చాయి. దేశం మొత్తం బుజ్జి కూడా పెద్దఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది. వీటన్నింటితో కల్కి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముందుగా ట్రైలర్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ రివ్యూలో కూడా అదే మాట రావడంతో అందరూ ఆనందంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే మూవీకి U/A సర్టిఫికేట్ వచ్చింది.. రన్ టైమ్ కూడా 2 గంటల 55 నిమిషాలు అంటూ చాలానే అప్ డేట్స్ వస్తున్నాయి.

సెన్సార్ రివ్యూ:

ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు మరింత ఊతమిస్తూ ఇప్పుడు సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. ఆ రివ్యూలో.. కల్కి ఒక విజువల్ వండర్ అని.. మాస్టర్ పీస్ అంటూ చెప్పుకొచ్చారు. మూవీలో ఎమోషన్, నాటకీయ పరిణామాలు సినిమా బిగ్ అసెట్ అంటున్నారు. భైరవగా ప్రభాస్ తన కెరీర్లో మరో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ మూవీలో బిగ్ స్టార్స్, లెజెండ్స్ తో చేయించిన క్యామియో రోల్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని చెబుతున్నారు. క్లైమ్యాక్స్ మాత్రం ఈ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్ మూవీగా కల్కి నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. నాగ్ అశ్విన్ విజన్, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ విలువలు ఇండియన్ సినిమాని మరో మెట్టు ఎక్కించడమే కాకుండా.. హాలీవుడ్ రేంజ్ అంటూ కితాబు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సెన్సార్ రివ్యూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలాగే కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడో బ్లాక్ బస్టర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. వారి నమ్మకాన్ని మరింత పెంచుతూ ఇప్పుడు సెన్సార్ రివ్యూ వచ్చేసింది. అలాగే ఇటీవల నాగ్ అశ్విన్ చెప్పిన సైంటిఫిక్ మైథాలజీ అనే పాయింట్ జనాల్లోకి బాగా వెళ్లింది. పురాణాలు, ఇతిహాసాలను సైన్స్ అండ్ టెక్నాలజీ యాంగిల్ లో చూపించడం అనే కాన్సెప్ట్ బాగా నచ్చేసింది. అంతేకాకుండా.. కల్కి సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రోజు రోజుకూ పెంచుతూ పోతున్నారు. ఓవర్సీస్ లో కూడా కల్కి హవా నడుస్తోంది. ప్రీ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ మూవీ సెన్సార్ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments