iDreamPost
android-app
ios-app

Saindhav: సైంధవ్ ఫంక్షన్ లోKA పాల్ రచ్చ! ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తూ..!

  • Published Jan 08, 2024 | 12:06 PM Updated Updated Jan 08, 2024 | 12:30 PM

విక్టరీ వెంటకటేష్ నటించిన సైంధవ్ చిత్రం ఈ సంక్రాంతికి విదుడుల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన సైంధవ్ ఫంక్షన్ లో KA పాల్ కాస్త రచ్చ చేశాడు.

విక్టరీ వెంటకటేష్ నటించిన సైంధవ్ చిత్రం ఈ సంక్రాంతికి విదుడుల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన సైంధవ్ ఫంక్షన్ లో KA పాల్ కాస్త రచ్చ చేశాడు.

  • Published Jan 08, 2024 | 12:06 PMUpdated Jan 08, 2024 | 12:30 PM
Saindhav: సైంధవ్ ఫంక్షన్ లోKA పాల్ రచ్చ! ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తూ..!

ఇప్పటికే విడుదల చేసిన సైంధవ్ మూవీ ట్రైలర్ కు.. ఆడియన్సు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా సైంధవ చిత్రం థియేటర్ లలో విడుదల కానుంది. పైగా ఈ చిత్రం వెంకటేష్ కు 75వ చిత్రం కావడం విశేషం. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే, విడుదలకు మరి కొద్దీ రోజులు మాత్రమే ఉండడంతో.. చిత్ర బృందం అంతా మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్ ఈ ప్రమోషన్స్ లో మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఫంక్షన్ లో KA పాల్ కొంచెం హడావిడి చేశారు. అక్కడ ఫ్యాన్స్ కు ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. దీనితో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో KA పాల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. మొదట ఒక మతాధిపతిగా ఆయన బాగా ఫేమస్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత KA పాల్ ఇంకా ఫేమస్ అయ్యాడు. అతను ఎక్కడ కనిపించినా ఎదో ఒక హడావిడి చేస్తూనే ఉంటాడు. దీనితో నిత్యం సోషల్ మీడియాలో… మీమ్స్, ట్రోల్ల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతాడు. ఇక తాజాగా.. KA పాల్ కు సంబంధించిన మరొక వీడియో సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. ‘సైంధవ’ చిత్రానికి సంబంధించి మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. సామజిక మాధ్యమాలలో ఎక్కడ చూసిన వెంకీ మామ సైంధవ సందడే కనిపిస్తోంది. అయితే, ఈ  మూవీకి సంబంధించి తాజాగా జరిగిన ఓ ఈవెంట్ కు KA పాల్ కూడా అటెండ్ అయ్యాడు. ఇంకా KA పాల్ గురించి తెలియంది ఏముంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎదో ఒక అలజడి అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో సైంధవ్ ఫంక్షన్ లో అతనిని కొంతమంది ఫోటో అడగగా.. నేనెవరో తెలుసా నీకు అంటూ కాస్త ఘాటుగా అక్కడున్న ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

KA Pal Rachcha in Saindhava function

ఇక సైంధవ్ విషయానికొస్తే జనవరి13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్‌- శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ .. అభిమానులను ఎంత ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. వెంకటేష్ మాత్రం ప్రస్తుతానికి ఈ మూవీ ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా ఉంటూ.. ప్రతి ఈవెంట్ లోను తనదైన శైలిలో అభిమానులకు కనువిప్పు కలిగిస్తున్నాడు. సామజిక మాధ్యమాలలో వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేవారు ఎక్కడైనా ఇటువంటి హడావిడి చేస్తే.. అది కాస్త వైరల్ అవ్వడం సహజం. ఇప్పుడు KA పాల్ వీడియో కూడా అలానే నెట్టింట ట్రోల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş