iDreamPost
android-app
ios-app

కిరణ్ అబ్బవరం కు కలిసొచ్చిన ‘క’ .. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

  • Published Nov 02, 2024 | 12:41 PM Updated Updated Nov 02, 2024 | 12:41 PM

Ka Movie Collections: చెప్పాడు వచ్చాడు హిట్ కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ హీరో గురించే టాక్ నడుస్తుంది. క సినిమాతో కిరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పి తీరాల్సిందే, రెండు రోజుల్లో క సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసేద్దాం.

Ka Movie Collections: చెప్పాడు వచ్చాడు హిట్ కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ హీరో గురించే టాక్ నడుస్తుంది. క సినిమాతో కిరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పి తీరాల్సిందే, రెండు రోజుల్లో క సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసేద్దాం.

  • Published Nov 02, 2024 | 12:41 PMUpdated Nov 02, 2024 | 12:41 PM
కిరణ్ అబ్బవరం కు కలిసొచ్చిన ‘క’ .. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో , ప్రెస్ మీట్స్ లో కిరణ్ అబ్బవరం ఓ మాట చెప్పాడు. ఒకవేళ సినిమా నచ్చకపోయినా, కొత్తగా అనిపించకపోయినా తాను సినిమాలు తీయడం మానేస్తాను అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ మాట విని కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది హీరోలు ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళే. కానీ ఇక్కడ కిరణ్ అబ్బవరం కేసు వేరే. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కు గురయ్యాడు. అలాంటిది ఇప్పుడు ‘క’ తర్వాత అదే సోషల్ మీడియాలో కిరణ్ గురించి విపరీతమైన పాజిటివ్ బజ్ వినిపిస్తుంది. ‘క’ ఈ కుర్ర హీరో మాట తప్పనివ్వలేదు. తక్కువ థియేటర్స్ ఇచ్చినా కానీ కిరణ్ అబ్బవరం కు ‘క’ సినిమా కోట్లు తెచ్చిపెడుతుంది.

కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. ప్రీమియర్స్ తోనే సినిమాను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రోజు రోజుకు కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. వేరే సినిమాలతో కంపేర్ చేస్తే.. పాజిటివ్ మౌత్ టాక్ తో షోస్ పెరిగాయి. మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 6.18 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. షోస్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. అలా రెండో రోజు కలెక్షన్స్ కూడా దుమ్మురేపాయి. రెండో రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు రూ.3 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. మొత్తం మీద రెండు రోజుల్లో క సినిమా రూ. 9.25 కోట్ల నుండి రూ 10.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక మూడో రోజు కూడా కాసుల వర్షం కురిపించే అవకాశం లేకపోలేదు. వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ అందుకుంటుందేమో చూడాలి. ఏదేమైనా క సినిమాతో కిరణ్ అబ్బవరం కం బ్యాక్ ఇచ్చాడని చెప్పి తీరాల్సిందే.

నిజానికి సినిమాలో ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ కానీ .. గతంలో ఎన్నడు చూడని కంటెంట్ కానీ లేదు. ఇదే తరహాలో ఆల్రెడీ ఓ మూవీ వచ్చింది కానీ ప్రేక్షకులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిరణ్ ప్రెస్ మీట్స్ లో పదే పదే నొక్కి చెప్పిన ఆఖరి ఘట్టం.. ‘క’ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. అదే ఈరోజు సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ చూసిన తర్వాత ఓ శాటిస్ఫాక్షన్ తో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. వచ్చాడు , చెప్పాడు కొట్టాడు అంటూ కిరణ్ అబ్బవరం ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఒకవేళ మొదటి రోజు ‘క’ కు ఎక్కువ థియేటర్స్ దొరికి ఉంటే.. కలెక్షన్స్ కౌంట్ ఇంకాస్త పెరిగేదేమో. ఏదేమైనా కిరణ్ అబ్బవరం కెరీర్ లో క మూవీ టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom