iDreamPost
android-app
ios-app

దేవర కోసం రిషబ్ బిగ్ స్కెచ్.. దీనిలో నిజమెంత ?

  • Published Oct 16, 2024 | 6:10 PM Updated Updated Oct 16, 2024 | 6:10 PM

దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో తారక్ ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఇతర లాంగ్వేజ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దాదాపు కాంతారా సినిమాలో దేవరోడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో తారక్ ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఇతర లాంగ్వేజ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దాదాపు కాంతారా సినిమాలో దేవరోడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

  • Published Oct 16, 2024 | 6:10 PMUpdated Oct 16, 2024 | 6:10 PM
దేవర కోసం రిషబ్ బిగ్ స్కెచ్..  దీనిలో నిజమెంత ?

డివైడ్ టాక్ తో ఈ రికార్డ్స్ ఏంటి సామి.. తారక్ మాస్ తాండవం ఆడాడు.. దసరా విన్నర్ దేవర.. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం.. తారక రాముడే కానీ బాక్స్ ఆఫీస్ భీముడు. ఇలా ఒకటా రెండా తారక్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇదంతా ఒక్క దేవర సినిమా కారణంగానే జరిగింది. దీనితో తారక్ ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఇతర భాషల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు కంటే ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకునే ప్లాన్ లో ఉన్నాడు. అప్పడే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం తారక్ వార్-2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఎక్కువ శాతం కన్నడ నటీ నటులను ఎంచుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా కన్నడ సినిమాలలో నటించాలని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తుంది.

అలాగే గతంలో ఎన్టీఆర్ కు కన్నడ హీరోలతో స్నేహం ఉండేది. కానీ అది ఈ మధ్య ఇంకాస్త ఎక్కువైందని బజ్ నడుస్తుంది. ఈ మధ్యన తన ఫ్యామిలీ తో కలిసి అక్కడ దేవాలయాలకు కూడా వెళ్లి వచ్చాడు. అదే సమయంలో కాంతార మూవీలో తారక్ నటిస్తున్నాడని టాక్ మొదలైంది. కాంతార ప్రీక్వెల్ విషయంలో రిషబ్ శెట్టి ఎంత సీరియస్ గా ఉన్నాడో తెలియనిది కాదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మొదటి పార్ట్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరూ చూసారు. దీనితో ఇప్పుడు ప్రిక్వెల్ పై అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. సో రిషబ్ శెట్టి కూడా అదే రేంజ్ లో సినిమాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే మొదటి పార్ట్ లో స్ట్రాంగ్ విలన్ లేడు. సో ఈసారి మాత్రం స్ట్రాంగ్ విలన్ ను పెట్టె ప్లాన్ లో ఉన్నాడు. ఆ బలమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తారక్ కు కథ కూడా చెప్పాడట.

ఎలాగూ తారక్ ఇప్పుడు వార్ -2 లో విలన్ గా చేస్తున్నాడు. సో ఈ సినిమాలో కూడా తారక్ ను విలన్ గా చూపించబోతున్నాడట. ఇందులో ఎక్కడా కూడా తారక్ రేంజ్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారట. హీరోగా ఇరగదీసిన తారక్ విలన్ గా మెప్పిస్తాడా అంటే.. వందకు తొంబై శాతం అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎంచుకున్న ప్రతి పాత్రకు వంద న్యాయం చేసే నటుడు తారక్. కాబట్టి రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కోసం ఎలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేశాడో తేలియడమే బ్యాలెన్స్. ఇలా తారక్ ప్రస్తుతం సెలెక్ట్ చేసుకునే ప్రతి ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా అక్కడక్కడ కాస్త చిన్న చిన్న విమర్శలు  వచ్చాయి. ఈసారి అలాంటి నెగెటివిటికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఉండేలా.. పక్కా ప్లానింగ్ తో దేవరోడు దూసుకుపోతున్నాడు. ఇక కాంతార 2 లో దాదాపు తారక్ ఫిక్స్ అయినట్లే. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş