iDreamPost
android-app
ios-app

ప్లాప్ డైరెక్టర్స్ ను కాలర్ ఎగేరేసుకునేలా చేస్తున్న తారక్!

  • Published Sep 30, 2024 | 1:41 PM Updated Updated Sep 30, 2024 | 1:41 PM

Jr. NTR: దేవర విషయంలో అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు తారక్. ఇదిలా ఉంటే ప్రతి ప్లాప్ డైరెక్టర్ కు తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తున్నాడు.

Jr. NTR: దేవర విషయంలో అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు తారక్. ఇదిలా ఉంటే ప్రతి ప్లాప్ డైరెక్టర్ కు తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తున్నాడు.

  • Published Sep 30, 2024 | 1:41 PMUpdated Sep 30, 2024 | 1:41 PM
ప్లాప్ డైరెక్టర్స్ ను కాలర్ ఎగేరేసుకునేలా చేస్తున్న తారక్!

తారక్ చించేశాడు. ఎన్టీఆర్ కళ్ళతో యాక్టింగ్ చితక్కొట్టేశాడు.. కొరటాల శివ కేక పుట్టించాడు. ఇవన్నీ తారక్ అభిమానుల నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు చెప్తున్న మాటలు. సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు అయినా ఆడియన్స్ లో ఆ వేడి ఇంకా తగ్గలేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు శాటిస్ఫాక్షన్ తో వస్తున్నారు. కంటెంట్ ఉన్న కథకు ఇంతకు మించి కావాల్సింది ఏముంది. నిజమే దేవర విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ కొనసాగిందో.. అలానే ప్రస్తుతం థియేటర్స్ లో రఫ్ ఆడిస్తుంది. దేవరోడి దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. సరే ఇదంతా బాగానే ఉంది. కచ్చితంగా దేవర కోట్లు కొల్లగొట్టేస్తుంది. అందులో డౌట్ ఏమి లేదు. మాట ఇచ్చినట్లుగానే అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. అయితే, అటు అభిమానులతో పాటు ఇటు.. దర్శకులను కూడా తలెత్తుకునేల చేస్తున్నాడు తారక్. ప్లాప్ డైరెక్టర్స్ పాలిట వరంగా మారాడు. తారక్ దగ్గర ప్లాప్ డైరెక్టర్స్ కు బ్లాక్ బస్టర్స్ ఇవ్వబడును అనే బోర్డ్ రెడీ చేయడమే లేట్. అదేంటా అనుకుంటున్నారా.. మరి ఆ ప్లాప్ డైరెక్టర్స్ ఎవరో.. తారక్ వారికి ఎలాంటి హిట్స్ ఇచ్చాడో చూసేద్దాం.

ఆ దర్శకులు ఎవరో తెలియాలంటే కాస్త వెనక్కు వెళ్లాల్సిందే. 2018 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్- తారక్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అరవింద సమేత. ఇది థియేటర్స్ ను కుదిపేసింది. ఒక డిజాస్టర్ తర్వాత దర్శకుడు ఎలా అయినా హిట్ కొట్టాలన్న కసితో తీశాడా అనిపించింది. ఇంతకీ దీనికి ముందు డైరెక్టర్ కు డిజాస్టర్ గా నిలిచిన మూవీ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి. తర్వాత 2017లో డైరెక్టర్ బాబీ- తారక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ. తారక్ త్రిపాత్రాభినయం చేసిన మూవీ. దీనితో ఈ సినిమా అప్పట్లో అభిమానులను ఒక ఊపు ఊపేసింది. కానీ దానికంటే ముందు బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో ప్లాప్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత, మహేష్ నటించిన వన్ నేనొక్కడినే మూవీతో డీలా పడిన సుకుమార్ కు కూడా హిట్ ఇచ్చేశాడు తారక్. 2016 లో తారక్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ నాన్నకు ప్రేమతో. మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. దర్శకుడికి హిట్ టాక్ ను సంపాదించి పెట్టింది. తర్వాత 2015 లో తారక్- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన టెంపర్ మూవీ. అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇది కూడా ఆ దర్శకుడికి హార్ట్ ఎటాక్ లాంటి ప్లాప్ మూవీ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్.

ఇక ఇప్పుడు కొరటాల శివ వంతు.. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల నిలబడతాడా లేదా అని అనుకున్నారు. ఇటు దేవరపై  బాగానే హైప్ నడుస్తున్నా.. ఎక్కడో కాస్త తడబడ్డారు అభిమానులు. కానీ దేవర బొమ్మ థియేటర్ లో పడిన వెంటనే.. కొరటాల రీసౌండ్ గట్టిగా వినిపించింది. ఒక్క దెబ్బతో తన సత్తా చూపించాడు. ఇలా చూసినట్లయితే ఒక దర్శకుడి ప్రతి ఫాల్ తర్వాత తారక్ వారిని తలఎత్తుకునేలా చేస్తున్నాడు. కాబట్టి తారక్ వారి పాలిట అదృష్టంగా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవరతో మరోసారి దీనిని ప్రూవ్ చేసినట్లయింది. ఇక రానున్న రోజుల్లో ఇంకా తారక్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో వేచి చూడాలి.ప్రస్తుతానికి దేవర మాత్రం థియేటర్స్ లో దూసుకుపోతుంది. కలెక్షన్స్ లెక్క తేల్చడమే బ్యాలన్స్. మరి తారక్ ప్లాప్ డైరెక్టర్స్ పాలిట వరంగా మారడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom