iDreamPost
android-app
ios-app

తారక్ మరో భారీ ప్రాజెక్ట్ .. ఈ కాంబో వేరే లెవెల్

  • Published Oct 05, 2024 | 11:42 AM Updated Updated Oct 05, 2024 | 11:42 AM

NTR Upcoming Projects : దేవర సినిమా ఊచకోత చూసిన తర్వాత.. తారక్ తర్వాత సినిమాల మీద మరింత ఆసక్తి పెరిగిపోయింది. నెక్స్ట్ కాంబో ఎవరై ఉంటారా.. తారక్ ఎలాంటి కథలను ఎంపిక చేసుకుంటాడా అని అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

NTR Upcoming Projects : దేవర సినిమా ఊచకోత చూసిన తర్వాత.. తారక్ తర్వాత సినిమాల మీద మరింత ఆసక్తి పెరిగిపోయింది. నెక్స్ట్ కాంబో ఎవరై ఉంటారా.. తారక్ ఎలాంటి కథలను ఎంపిక చేసుకుంటాడా అని అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 05, 2024 | 11:42 AMUpdated Oct 05, 2024 | 11:42 AM
తారక్ మరో భారీ ప్రాజెక్ట్ ..  ఈ కాంబో వేరే లెవెల్

దేవర సినిమాతో ఆరేళ్ళ ఆకలి తీర్చేసి.. ఫుల్ మీల్స్ పెట్టేసాడు తారక్ . కొంతకాలం వరుస ప్లాప్స్ చూసిన తర్వాత తారక్ కథల ఎంపిక మారింది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి కథలనే ఎంచుకుంటున్నాడు. దానికి నిదర్శనం పదేళ్ల నుంచి తారక్ అందిస్తున్న హిట్స్. నా ఫ్యాన్స్ కాలర్ ఎగేరేసుకునేలా చేస్తాను అన్నాడు. అదే చేస్తున్నాడు. అన్న మాట అంటే బ్రహ్మ రాత అంటూ.. అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దేవర మాస్ జాతర ఎలా జరుగుతుందో తెలియనిది కాదు. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సరే దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి తర్వాత ఏంటి?.. నెక్స్ట్ తారక్ ఎలాంటి కథలను ఎంచుకుంటాడు? ఏ దర్శకుడికి వరంగా మారబోతున్నాడు ? ఇలా ప్రేక్షకుల ఫోకస్ అంతా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదకు మళ్లింది. ఆ వివరాలు చూసేద్దాం.

ప్రస్తుతం తారక్ బాలీవుడ్ లో తన డెబ్యూ మూవీతో బిజీగా ఉన్నాడు. అదే వార్-2.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు కథనాలు వింటూనే ఉన్నాం. అటు షూటింగ్ పనులు కూడా వేగ వంతంగా కొనసాగుతున్నాయి. హృతిక్ రోషన్ , తారక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపైన అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2025 ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఆ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో భాగం కానున్నాడు. ఈ సినిమా పేరు , షూట్ కూడా స్టార్ట్ చేయకుముందే.. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు ప్రశాంత్ నీల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వేల కోట్ల వసూళ్లను రాబట్టేందుకు.. పక్కా ప్లానింగ్ ను రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కథ గురించి కూడా టాక్ నడుస్తుంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

ఇక ఈ రెండు కాకుండా తారక్ మరో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బీస్ట్ , జైలర్ 2 సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్.. నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీకి ఒకే చెప్పాడట తారక్. ఇప్పటికే నెల్సన్ తారక్ కు కథ చెప్పినట్లు సమాచారం. తారక్ కు కూడా కథ నచ్చిందని ఇన్సైడ్ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2026 లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సో  అటు తారక్ , ఇటు నెల్సన్ ఇద్దరూ బిజీగానే ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్సుమెంట్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్ . ఇక ఇవి మాత్రమే కాకుండా తారక్.. తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తో మూవీ చేయడానికి.. తనకు ఓకే అంటూ ఓపెన్ గా చెప్పేశాడు. కాబట్టి వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఈసారి తారక్ ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler