iDreamPost
android-app
ios-app

జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

  • Published Aug 14, 2024 | 3:18 PM Updated Updated Aug 14, 2024 | 3:18 PM

Jr NTRs Team Clears The Air On Rumors Of A Minor Injury: జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరిగిందని.. ఎడమచేతి మణికట్టుకు గాయం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Jr NTRs Team Clears The Air On Rumors Of A Minor Injury: జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరిగిందని.. ఎడమచేతి మణికట్టుకు గాయం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి టీమ్ క్లారిటీ ఇచ్చింది.

  • Published Aug 14, 2024 | 3:18 PMUpdated Aug 14, 2024 | 3:18 PM
జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారిన తర్వాత వస్తున్న మూవీ దేవర పార్ట్- 1. ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా దేవర పార్ట్ 1లో తన క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నాను అంటూ స్వయంగా తారక్ ప్రకటించాడు. ఫొటో షేర్ చేసి షూటింగ్ వ్రాపింగ్ అయిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వార్త విన్న తర్వాత ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తారక్ కు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మంగళవారం రాత్రి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై టీమ్ క్లారిటీ ఇచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాపై ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. అప్ డేట్స్ చూస్తే సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా ఉంది. పైగా తారక్ పార్ట్ వరకు షూటింగ్ కూడా అయిపోవడంతో.. చెప్పిన సమయానికి దేవర వస్తాడు అని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తారక్ కు కారు ప్రమాదం జరిగింది అని వార్తలు రావడంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు ప్రమాదంలో తారక్ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయ్యాయని.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు అంటూ చెబుతున్నారు.

ఈ వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఈ ప్రమాదం వార్తలను ఖండించింది. తారక్ కు కొన్ని రోజుల క్రితం జిమ్ లో ఎడమ చేతి మణికట్టుకు చిన్న గాయమైందని వెల్లడించింది. మంగళవారం రాత్రి దేవరకు సంబంధించి తారక్ షూట్ కూడా పూర్తైందని వెల్లడించారు. ముందు జాగ్రత్తతోనే కట్టు కూడా కట్టించినట్లు తెలిపారు. తారక్ కు కారు ప్రమాదం జరిగిందని.. గాయం అయ్యింది అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు అని స్పష్టం చేశారు. తారక్ కు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలకు టీమ్ పుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss