iDreamPost
android-app
ios-app

అదుర్స్ హీరోయిన్ షీలా ఇప్పుడెలా ఉందంటే..? 14 ఏళ్లు దాటినా అదే అందం!

  • Published Jul 22, 2024 | 4:05 PM Updated Updated Jul 22, 2024 | 4:05 PM

Adhurs Movie Actress Sheela.. మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్ తారక్.. మ్యాన్ ఆఫ్ ది యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన మూడు చిత్రాల్లో ఒకటి అదుర్స్. ఈ మూవీలో తారక్ డ్యుయల్ రోల్ చేసిన సంగతి విదితమే. చారీ పాత్ర తారక్ కెరీర్ లో ఎవర్ గ్రీన్. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు నయన తార కాగా, మరొకరు షీలా.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Adhurs Movie Actress Sheela.. మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్ తారక్.. మ్యాన్ ఆఫ్ ది యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన మూడు చిత్రాల్లో ఒకటి అదుర్స్. ఈ మూవీలో తారక్ డ్యుయల్ రోల్ చేసిన సంగతి విదితమే. చారీ పాత్ర తారక్ కెరీర్ లో ఎవర్ గ్రీన్. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు నయన తార కాగా, మరొకరు షీలా.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • Published Jul 22, 2024 | 4:05 PMUpdated Jul 22, 2024 | 4:05 PM
అదుర్స్ హీరోయిన్ షీలా ఇప్పుడెలా ఉందంటే..? 14 ఏళ్లు దాటినా అదే అందం!

వివి వినాయక్.. ఇప్పుడంటే సక్సెస్ లేక వెనుకబడ్డాడేమో కానీ.. ఒకప్పుడు బాక్సాఫీసుకు కలెక్షన్స్ అంటే ఏంటో చూపించిన దర్శకుడు. తన తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన వెరీ స్పెషల్ డైరెక్టర్. ఆది మొదలుకుని.. హిందీ ఛత్రపతి వరకు చూస్తే ఎంతో మంది హీరోలకు భారీ హిట్లు అందించాడు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేశ్, రవితేజ, రామ్ చరణ్, అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, సాయి తేజ్, నితిన్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడాయన. వీరిలో అత్యధికంగా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు రూపొందించాడు. ఆది, సాంబ, అదుర్స్ ఉన్నాయి. సాంబ మినహాయించి మిగిలిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.

వినాయక్ ఫస్ట్ డీల్ చేసిన హీరో తారక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన కామెడీ అండ్ యాక్షన్ మూవీ అదుర్స్. ఇందులో యంగ్ టైగర్ డ్యూయల్ రోల్ పోషించాడు.  చారీ పాత్ర ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పోషించిన ది బెస్ట్ పాత్రల్లో ఒకటని చెప్పొచ్చు. బ్రహ్మనందం- ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్ తెప్పిస్తుంటాయి. చాలా మంది ఇప్పుడు దీన్ని మీమ్స్‌కు కూడా వినియోగిస్తున్నారు. 2010లో సంక్రాంతి సమయంలో విడుదలైన ఈ మూవీ వసూళ్ల పరంగా ఓకే అనిపించుకుంది. ఇక ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడిపాడిన సంగతి విదితమే. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు పరుగు మూవీతో ఓవర్ నైట్ స్టారైన షీలా. ఇందులో గ్లామరస్ పాత్రలో మెప్పిస్తుంది. నందు పాత్రలో మెరిసింది.

ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన షీలా కౌర్.. తెలుగు మూవీతో హీరోయిన్ అయ్యింది. నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోక మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వీరాస్వామి అనే తమిళ సినిమా చేశాక.. మంచు మనోజ్ సరసన రాజు భాయ్‌లో చేసింది. ఇందులో ‘ఎవ్వరు నువ్వు’ సాంగ్ వింటే ఇప్పటికీ ఆ అమ్మాయే గుర్తుకు వస్తుంది. తెలుగులో హలో ప్రేమిస్తారా..? పరుగు చిత్రాల్లో నటిచింది. పరుగు తర్వాత ఆమె రికగ్నైజ్ అయ్యింది. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు.. కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో మస్కా, అదుర్స్ తో పాటు పరమ వీర చక్రలో యాక్ట్ చేసింది. 2018లో చివరిగా హైపర్ అనే కన్నడ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ. 2020లో సంతోష్ రెడ్డి అనే వ్యాపార వేత్తను చేసుకుంది. వీరికో పాప. ఈ మధ్య షీలా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. ఇన్ స్టా తన పాప ఫోటోలతో పాటు ఎక్స్ ప్లోర్ చేస్తున్న వీడియోలు పెడుతూ ట్రెండ్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet