వీడియో : క్యాన్సర్ ‌తో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన NTR

Jr NTR Talks To His Fan: ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని.. దేవర సినిమా సినిమా చూసే వరకు బ్రతికించమని ప్రాధేయ పడిన సంగతి తెలిసిందే. తాజాగా తారక్ ఈ విషయంపై స్పందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తారక్ అభిమాని.. దేవర సినిమా చూసే వరకు తనని బ్రతికించాలంటూ వేడుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో.. తారక్ వరకు చేరింది. దీనితో తారక్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అభిమాని కౌశిక్ తో.. వీడియో కాల్ లో మాట్లాడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కసారిగా తారక్ ను చూసిన కౌశిక్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. “అసలు మిమ్మల్ని చూస్తానని అసలు అనుకోలేదన్నా”. అంటూ మురిసిపోయాడు. తారక్ కూడా “నవ్వుతూ ఉంటే బాగున్నావు” అంటూ రెస్పాండ్ అయ్యాడు. అలాగే అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అన్ని వివరాలు కనుక్కుని.. ధైర్యం చెప్పారు. “సినిమాలు తర్వాత.. ముందు ధైర్యంగా బయటికి రావాలి. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి” అంటూ సూచించారు.

Show comments