iDreamPost
android-app
ios-app

సినిమాల్లోకి జూ. ఎన్టీఆర్‌ కొడుకు.. సితారతో కలిసి స్క్రీన్‌ షేర్‌?

  • Published Jul 16, 2023 | 5:30 PM Updated Updated Jul 16, 2023 | 5:30 PM
  • Published Jul 16, 2023 | 5:30 PMUpdated Jul 16, 2023 | 5:30 PM
సినిమాల్లోకి జూ. ఎన్టీఆర్‌ కొడుకు.. సితారతో కలిసి స్క్రీన్‌ షేర్‌?

సినిమా స్టార్ల పిల్లలు సినిమాల్లోకి అడుగుపెట్టడం అన్నది సర్వ సాధారణం. స్టార్‌ కిడ్స్‌గా సినిమాల్లోకి అడుగు పెట్టి.. ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న వారు చాలా మందే ఉన్నారు. హీరోలుగానే కాదు.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా కూడా సినిమాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ బాటలోకే జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు అభయ్‌ రామ్‌ కూడా చేరిపోతున్నట్లు తెలుస్తోంది. అభయ్‌ రామ్‌ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. అది కూడా మహేష్‌ బాబు కూతురు సితారతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట.

అది కూడా ప్రపంచ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి సినిమాతో ఈ ఎంట్రీ జరగనుందట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్‌ మాదిరిగా ఈ సినిమా ఉండబోతోందని టాక్‌. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక, ఈ సినిమాలోని ఇంట్రడక్షన్‌ సీన్‌ కోసం అభయ్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారట. ఈ సీన్‌లో అభయ్‌-సితారలను అక్కాతమ్ముళ్లుగా చూపించనున్నారని టాక్‌. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్‌గా మారింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఈ వార్తలతో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలు నిజం కావాలని దేవుడ్ని కోరుకుంటున్నారు. కాగా, మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరో వైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి, జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు అభయ్‌ రామ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss