iDreamPost
android-app
ios-app

వీడియో: అభిమానుల్లో తారక్ ఫ్యాన్స్ వేరయా.. అప్పుడే స్టార్ట్ చేశారుగా..

యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ పై తమ అభిమాానాన్ని మరోసారి ప్రదర్శించారు అభిమానులు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అని రోడ్డుపై వెళుతున్న జనాలు ఆసక్తిగా చూశారు. ఇంతకు ఏమైందంటే..?

యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ పై తమ అభిమాానాన్ని మరోసారి ప్రదర్శించారు అభిమానులు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అని రోడ్డుపై వెళుతున్న జనాలు ఆసక్తిగా చూశారు. ఇంతకు ఏమైందంటే..?

వీడియో: అభిమానుల్లో తారక్ ఫ్యాన్స్ వేరయా.. అప్పుడే స్టార్ట్  చేశారుగా..

జూనియర్ ఎన్టీఆర్.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎలాంటి సపోర్టు తీసుకోకుండా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అవమానాలు, అవరోధాలను దాటుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. బొద్దుగా ఉన్నాడన్న విమర్శలను తిప్పికొట్టి.. బాడీపై శ్రద్ధ పెట్టి బరువు తగ్గించుకుని, అనేక మంది నోళ్లను మూయించాడు ఈ నందమూరి నట వారసుడు. ప్లాపులు, హిట్స్ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే తన 29 సినిమాలతో అభిమానుల రూపంలో అశేష జనాన్ని కూడగట్టుకున్న యంగ్ టైగర్ పట్ల.. ఫ్యాన్స్ కూడా అంతే ఆప్యాయతతో ఉంటారు. అందుకు ఉదాహరణ ఇదిగో ఈ సంఘటన. మరోసారి తారక్ పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శించారు ఫ్యాన్స్.

తమ ఫేవరేట్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే..  వారం నుండి లేదా పది రోజుల ముందు నుండి వేడుకలు స్టార్ట్ చేస్తారు. కానీ అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరయ్యా అని నిరూపించారు. మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని నెల రోజుల ముందు నుండే హడావుడి మొదలు పెట్టారు ఫ్యాన్స్. గ్రాండ్‌గా ప్రీ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇందుకు వేదికైంది.. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్. తారక్ భారీ పోస్టర్‌తో కూడిన కటౌట్‌ను థియేటర్ దగ్గర ఏర్పాటు చేసి.. పూలమాలలతో అలంకరించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ.. పూల జల్లుతూ హంగామా సృష్టించారు. దీంతో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందా అని చూశారు అక్కడి జనం. కాదూ… ఇది బర్త్ డే కౌంట్ డౌన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

‘జై ఎన్టీఆర్’ టీ షర్టులు ధరించి, బిగ్గరగా నినాదాలు చేస్తూ.. మేళతాళాలతో, డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని, కొత్త సినిమా రిలీజ్ వైభవాన్ని తీసుకు వచ్చారు. ఆ థియేటర్ చుట్టూ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. పుట్టిన రోజు ముందే ఈ లెవల్లో బర్త్ డే వేడుకలు ఉంటే.. ఇక పుట్టిన రోజు నాడు ఎంత హంగామా చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇక మాన్ ఆఫ్ ది మాస్ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. దీనితో పాటు వార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే ఇటీవల ముంబయి చేరుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ షురూ చేశాడు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis