iDreamPost
android-app
ios-app

“గుంటూరు కారం”లో Jr. NTR? త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్..!

గుంటూరు కారం సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారట... అంతేకాదు! త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్‌ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన న్యూస్‌ ఒకటి వైరల్‌గా మారింది.

గుంటూరు కారం సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారట... అంతేకాదు! త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్‌ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన న్యూస్‌ ఒకటి వైరల్‌గా మారింది.

“గుంటూరు కారం”లో Jr. NTR? త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్..!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేశారు. ఇప్పుడు రాబోతున్న గుంటూరు కారం మూడో సినిమా. దీంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా షూటింగ్‌ శరావేగంగా జరుగుతోంది. గుంటూరు కారంలో మహేష్‌ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల కలిసి నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య క్రిష్ణ, ఈశ్వరీ రావు, జయరాం, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రచారం మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తోంది. గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుతో జూనియర్‌ ఎన్టీఆర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారట. ఈ మేరకు ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ప్రచారం ప్రకారం.. అరవింద సమేత వీర రాఘవ సినిమాకు గుంటూరు కారం సినిమాకు సంబంధం ఉందట. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ యూనివర్స్‌ను క్రియేట్‌ చేస్తున్నాడట. ఆ కారణంతోనే గుంటూరు కారం సినిమాలో జూ.ఎన్టీఆర్‌ కనిపించనున్నారట.

ఆ ఫొటోలో గుంటూరు కారం, అరవింద సమేతలోని కొన్ని సీన్ల షాట్లను కలిపి ఉంచారు. అరవింద సమేత సినిమాకు సంబంధించిన  ఓ ఫొటోలో జూ.ఎన్టీఆర్‌ పక్కన ఈశ్వరీ రావు ఉన్నారు. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన మరో ఫొటోలో మహేష్‌ బాబు పక్కన కూడా ఈ‍శ్వరీ రావు ఉన్నారు. రెండు ఫొటోల్లో  ఆమె లుక్‌ ఒకటేలాగా ఉంది. మరో రెండు ఫొటోల్లో ఇంటిపై.. కారుపై ఒకే గుర్తు ఉంది. దీంతో ప్రచారం ఊపందుకుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ యూనివర్స్‌ను క్రియేట్‌ చేయడానికే పూజా హెగ్డేను తొలగించారని చెబుతున్నారు.

అయితే, త్రివిక్రమ్‌ యూనివర్స్‌.. గుంటూరు కారంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అ‍న్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా టీం నుంచి కానీ, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదే గనుక నిజం అయితే, మహేష్‌ బాబు, జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పాలి. ఇద్దరు స్టార్‌ హీరోలు అలా స్క్రీన్‌ మీద కనిపిస్తే.. కలెక్షన్ల వరద పొంగక మానదు. గుంటూరు కారం సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది. 2024న జనవరి 12 చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్న రిలీజైన ఓ పాటకు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరి, త్రివిక్రమ్‌ యూనివర్స్‌.. గుంటూరు కారంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అ‍న్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet