iDreamPost
android-app
ios-app

Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలోకి మరో రికార్డు!

  • Published Dec 22, 2023 | 8:37 PM Updated Updated Dec 22, 2023 | 8:37 PM

జూనియర్‌ ఎ‍న్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. జనవరి నెలలో హీరో, విలన్‌కు మధ్య ఫైట్‌ సీన్లు తెరకెక్కనున్నట్లు సమాచారం.

జూనియర్‌ ఎ‍న్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. జనవరి నెలలో హీరో, విలన్‌కు మధ్య ఫైట్‌ సీన్లు తెరకెక్కనున్నట్లు సమాచారం.

  • Published Dec 22, 2023 | 8:37 PMUpdated Dec 22, 2023 | 8:37 PM
Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలోకి మరో రికార్డు!

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది. టాలీవుడ్‌ నుంచి ఈ రికార్డు సాధించిన ఒకే ఒక వ్యక్తిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ నిలిచారు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా అమెరికన్‌ మ్యాగజైన్‌ ‘‘వెరైటీ’’.. 500 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రకటించింది. ఈ 500 మందిలో టాలీవుడ్‌ నుంచి దర్శకుడిగా ఎస్‌ఎస్‌ రాజమౌళికి స్థానం దక్కింది. ఇక, హీరోగా జూనియర్‌ ఎన్టీఆర్‌కు స్థానం దక్కింది. అమెరికన్‌ మ్యాగజైన్‌ వెరైటీలోనే కాదు.. పలు ఇంటర్‌నేషనల్‌ మ్యాగజైన్స్‌లో ఆయనకు చోటు దక్కింది.

‘ఏషియన్‌ వీక్లి’ 2023కి సంబంధించి ఆసియాలో టాప్‌ 50 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. ఈస్టర్న్‌ ఐ 2023 పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ 25వ స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో టాలీవుడ్‌నుంచి కేవలం జూ.ఎన్టీఆర్‌కు మాత్రమే చోటు దక్కింది. మొదటి స్థానంలో షారుఖ్‌ ఖాన్‌ ఉన్నారు. ఇక, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో జూనియర్‌ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయింది. ఆస్కార్స్‌ మెంబర్స్‌లో కూడా ఆయనకు చోటు దక్కింది.

జూనియర్‌ 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. జూనియర్‌ ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. దేవరకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.  రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం 2024 ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కానుంది. ఇందులో జూనియర్‌కు జంటగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు.

తంగం పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. విలన్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.  ఇక, దేవర షూటింగ్‌ సగానికి పైగా అయిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం గోవాలో షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరగనుంది. జనవరిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌-సైఫ్‌ అలీఖాన్‌ల మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ల షూటింగ్‌ జరగనుందని టాక్‌. రెండు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తెరకెక్కించనున్నారు.

జనవరి నెలలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ రానుందట. దేవర టీజర్‌ విడుదల కానుందట. దీనిపై అఫిషియల్‌ కన్‌ఫర్‌మేషన్‌ త్వరలో రానుందట. మరి, జూనియర్‌ ఎన్టీఆర్‌ అమెరికన్‌ మ్యాగజైన్‌ వెరైటీలో చోటు సాధించిన ఒకే ఒక్క టాలీవుడ్‌ హీరో అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş