iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ బాటలో దేవర.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా!

  • Published Sep 14, 2024 | 2:45 PM Updated Updated Sep 14, 2024 | 2:45 PM

Devara Movie Update: టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. తారక్ అభిమానులు ఈ మూవీ కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తారక్ ఆర్ఆర్ఆర్ బాటలోనే సాగుతున్నట్లు తెలుస్తుంది. అదేంటో చూసేద్దాం.

Devara Movie Update: టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. తారక్ అభిమానులు ఈ మూవీ కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తారక్ ఆర్ఆర్ఆర్ బాటలోనే సాగుతున్నట్లు తెలుస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 14, 2024 | 2:45 PMUpdated Sep 14, 2024 | 2:45 PM
ఆర్ఆర్ఆర్ బాటలో దేవర.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా!

ఏదైనా ఓ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవ్వాలంటే.. కేవలం భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, మంచి దర్శకుడు ఉంటే సరిపోదు. ఆ మూవీకి తగిన ప్రమోషన్స్ అదే రేంజ్ లో జరగాలి. కాస్త ప్రేక్షకులలో ఫేమ్ ఉండి.. కనీసం ఓ రూ.100 కోట్ల బడ్జెట్ ఉంటే.. ఎవరైనా పాన్ ఇండియా ఫిల్మ్ తీయొచ్చు. కానీ దానిని ఇంటర్నేషనల్ లెవెల్ లో విస్తరించాలంటే మాత్రం సరైన ప్లానింగ్ ఉండాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకులలో అలాంటి ప్లానింగ్ రాజమౌళికే ఉంది. ఆల్రెడీ బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రమోషన్స్ ఎలా ఉండాలో చూపించారు రాజమౌళి. తాజాగా తారక్ కూడా దేవర కోసం ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎలానో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

రీసెంట్ గా థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లలో కాసుల వర్షం కురిపించిన సినిమా కల్కి. ఇక ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ పోటెత్తాలంటే దేవర లాంటి మూవీ రావాల్సిందే. తారక్ అభిమానులతో పాటు.. ఎంటైర్ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న మూవీ దేవర . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ప్రేక్షకులకు అంచనాలను పెంచేసింది. కానీ ట్రైలర్ మాత్రం మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే ఇలా అంచనాలు తగ్గడం కూడా ఒకింత మంచిదే అనుకుంటున్నారు మేకర్స్ . ఎందుకంటే అప్పుడే థియేటర్స్ లో స్క్రీన్స్ మీద అసలైన కథను.. ఊహించని ఎలిమెంట్స్ ప్రేక్షకులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొరటాల శివ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే తెరకెక్కిస్తున్నారు. కాబట్టి దానికి తగిన ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సెప్టెంబర్ 27 న దేవర సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే దానికి ఒక రోజు ముందే అమెరికా లాస్ ఏంజెల్స్ లోని.. బియాండ్ ఫెస్ట్ 2024 లో దేవరను ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్ట్ కు ఎంతో మంది హాలీవుడ్ నటులు , టెక్నీషియన్స్ అటెండ్ అవుతారు. ఇక వారితో పాటు దేవర టీమ్ కూడా జాయిన్ అవ్వనున్నారు. ఎలాగూ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కు అక్కడ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. కాబట్టి ఇప్పుడు అదే క్రేజ్ ను ఉపయోగించుకోనున్నారు తారక్. సో ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి వేసిన బాటలోనే దేవర కోసం తారక్ నడుస్తున్నారన్నమాట. మరి ఈసారి ఈ ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు.. ఆ ఫెస్ట్ లో హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ.. సేలంస్ లాట్, గాడ్జిల్లా సినిమాలను కూడా ప్రదర్శించబోతున్నారు. అలాంటి సినిమాలతో సమానంగా దేవర సినిమాకు స్థానం దక్కిందంటేనే.. ఈ మూవీ సగం హిట్ అయినట్లే. చూడబోతుంటే థియేటర్స్ ల దేవర గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తుంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş