iDreamPost
android-app
ios-app

మంచి మనసు చాటుకున్న జూనియర్ యన్టీఆర్! ఆలయ నిర్మాణానికి లక్షల్లో సాయం!

  • Published May 15, 2024 | 1:08 PM Updated Updated May 15, 2024 | 1:08 PM

Jr NTR Donated Amount to a Temple: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. హీరోగానే కాదు.. తన అభిమానులకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందు ఉంటారు.

Jr NTR Donated Amount to a Temple: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. హీరోగానే కాదు.. తన అభిమానులకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందు ఉంటారు.

  • Published May 15, 2024 | 1:08 PMUpdated May 15, 2024 | 1:08 PM
మంచి మనసు చాటుకున్న జూనియర్ యన్టీఆర్!  ఆలయ నిర్మాణానికి లక్షల్లో సాయం!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే స్టార్ డమ్ తో ముందుకు సాగుతున్నారు. అలాంటి హీరోల్లో ఒకరు నందమూరి వారసుడు జూ.ఎన్టీఆర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 2001 లో ‘నిన్ను చూడాలని’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ మళ్లీ వెనక్కి చూసుకోలేదు. వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ చిత్రంలోని సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరో.. ఎన్టీఆర్ నటుడిగానే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మంచితనం చాటుకుంటున్నాడు. తన అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అంటూ స్వయంగా వెళ్లి సాయం అందిస్తాడు. ఎలాంటి హంగూ..ఆర్భాటాలు, ప్రచారం లేకుండా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం.. మంచి కార్యక్రమాలకు విరాళం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల ఆయన ఇచ్చిన భారీ విరాళం అభిమానుల ద్వారా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేటలో ఇటీవల శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో పాటు ప్రహారి గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్ రూ.12.50 విరాళం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఇప్పటి వరకు గోప్యంగా ఉంది.. ఎవరికీ తెలియకపోవడం విశేషం.

ఆలయ నిర్మాత దాతగా అక్కడ ఓ శిలాఫలకంపై నందమూరి తారకరామారావు(జూనియర్ ఎన్‌టీఆర్) ఆయన సతీమణి పేరు లక్ష్మీ ప్రణిత, కుమారులు అభయరామ్, భర్గవరామ్.. తల్లి షాలిని పేర్లు ఉన్నాయి. శిలా ఫలకానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇచ్చిన విరాళం ఏమాత్రం గొప్పగా చెప్పుకోకుండా సైలెంట్ గా ఉన్న మా హీరో నిజంగా గ్రేట్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet