iDreamPost
android-app
ios-app

Jr. NTR: తారక్ అంటే బళ్లారి ఫ్యాన్స్ కు ఇంత ప్రేమా.. దేవర కోసం భారీ ఏర్పాట్లు..

  • Published Sep 13, 2024 | 12:57 PM Updated Updated Sep 13, 2024 | 12:57 PM

Ballari Jr NTR Fans Devara Celebrations: దేవర రిలీజ్ సందర్భంగా బళ్లారిలోని తారక్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా వాళ్లు రిలీజ్ చేశారు.

Ballari Jr NTR Fans Devara Celebrations: దేవర రిలీజ్ సందర్భంగా బళ్లారిలోని తారక్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా వాళ్లు రిలీజ్ చేశారు.

  • Published Sep 13, 2024 | 12:57 PMUpdated Sep 13, 2024 | 12:57 PM
Jr. NTR: తారక్ అంటే బళ్లారి ఫ్యాన్స్ కు ఇంత ప్రేమా.. దేవర కోసం భారీ ఏర్పాట్లు..

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక్క తెలుగులోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విడుదల సమయంలో వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలిసిపోతుంది. ఇక వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు చేసిన సంఘటనలు మనం చాలానే చూస్తుంటాం. కాగా.. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే అభిమానులు థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తుంటారు. భారీ కటౌట్స్ పెట్టి, రక్త, పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. దేవర రిలీజ్ సందర్భంగా బళ్లారిలోని తారక్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా వాళ్లు రిలీజ్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. కానీ మేము సెప్టెంబర్ 26నే పండుగ జరుపుకొంటున్నామని ఎన్టీఆర్ బళ్లారి ఫ్యాన్స్ అంటున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లును చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయినట్లు వారు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ చెప్పుకొచ్చారు. ఈ వేడుకలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటాయని బళ్లారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ లో దేవరకు ఎలివేషన్స్ ఇస్తూ.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ కు చిన్న చిన్న లారీ బొమ్మలతో చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది చూస్తుంటేనే ఇలా ఉంటే.. ఇక ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో.. అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా.. దేవర కోసం కన్నడలో ఈ రేంజ్ సెలబ్రేషన్స్ చూస్తుంటే.. బళ్లారి ఫ్యాన్స్ కు తారక్ అంటే ఇంత పిచ్చి ప్రేమా అంటూ తెలుగు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారక్ అన్న గుణం అలాంటిది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి సెలబ్రేషన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా.. దేవర మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతూ ముందుకు  సాగుతోంది. తాజాగా హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించనున్న తొలి ఇండియన్ సినిమాగా దేవర అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రిలీజ్ కు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26న లాస్ ఏంజెల్స్ లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బళ్లారి ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş