iDreamPost
android-app
ios-app

మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఈరోజు హర్ష సాయి.. అసలేం జరుగుతుంది?

  • Published Sep 25, 2024 | 1:49 PM Updated Updated Sep 25, 2024 | 2:47 PM

Jani Master, Harsha Sai, Raj Tarun: అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ఒకరి తర్వాత మరొకరు లైన్ లోకి వస్తున్నారు. ఇప్పుడు అందరి ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొన్న రాజ్ తరుణ్ , నిన్న జానీ మాస్టర్ , ఈరోజు హర్ష సాయి. వీటి వెనుక కారణాలేంటి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Jani Master, Harsha Sai, Raj Tarun: అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ఒకరి తర్వాత మరొకరు లైన్ లోకి వస్తున్నారు. ఇప్పుడు అందరి ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొన్న రాజ్ తరుణ్ , నిన్న జానీ మాస్టర్ , ఈరోజు హర్ష సాయి. వీటి వెనుక కారణాలేంటి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 25, 2024 | 1:49 PMUpdated Sep 25, 2024 | 2:47 PM
మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఈరోజు హర్ష సాయి.. అసలేం జరుగుతుంది?

నిజమే ఇండస్ట్రీలో తరచూ ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మీడియా సోషల్ మీడియాలో నాలుగు ఐదు రోజులు వార్తలు వైరల్ అవ్వడం, ఆ తర్వాత యధావిధిగా కామ్ అయిపోవడం. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య మాత్రం ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్న రాజ్ తరుణ్ , నిన్న జానీ మాస్టర్ , ఈరోజు హర్ష సాయి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఒకరి తర్వాత మరొకరు లైన్ లోకి వస్తున్నారు. ఈ ముసుగులో ఇంకా ఎవరైనా స్టార్స్ ఉన్నారా? ఇన్ని రోజులు ఈ వివాదాలు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. ఇలాంటి డిస్కషన్స్ జరగడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. కింద మీద పడి.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే కానీ ఓ స్టాండర్డ్ కు రీచ్ కాలేరు. కానీ ఏదోవిధంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్లంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. రాజ్ తరుణ్ , జానీ మాస్టర్ , హర్ష సాయి.. వీళ్ళ పాపులారిటీనే వీరిని ముంచిందా.. ఒకరు పాపులర్ యూట్యూబర్ పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు. ఇంకొకరు ఫేమస్ డ్యాన్స్ మాస్టర్.. అసిస్టెంట్ జీవితంతో ఆడుకున్నాడు. మరొకరు ఫిల్మ్ హీరో.. అమ్మాయి పాలిట విలన్ గా మారాడు.ఇవన్నీ ఆ బాధిత యువతులు వారిపై ఇచ్చిన కంప్లైంట్స్. ఈ ముగ్గురు ప్రొఫెషన్స్ వేరు కానీ ఎదుర్కుంటున్న ఆరోపణలు మాత్రం ఒకటే. ఈ ముగ్గురిపై రే*ప్ కేసులు నమోదు అయ్యాయి. అమ్మాయిలను నమ్మించి మోసం చేసిన విషయంలో.. రే*ప్ కేసులో ముగ్గురు అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడు వీరిపై మీడియా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలను చూస్తుంటే ముగ్గురు నిండా మునిగిపోయారని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మొన్న జరిగిన రాజ్ తరుణ్ వివాదంలో ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు. సరిగ్గా రాజ్ తరుణ్ మూవీ ఏదైనా రిలీజ్ కు ఉందంటే ఆ వివాదం ఒక్కసారిగా తెరపైకి వస్తుంది. ఇక నిన్న మొన్నటివరకు నెట్టింట బర్నింగ్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా అనేక కథనాలు వినిపించాయి. తానూ ఏ తప్పు చేయలేదని నిక్కచ్చిగా చెప్పి లోనికి వెళ్లిన జానీ మాస్టర్.. కొద్దీ గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్ లో తప్పు ఒప్పుకున్నాడని తేలింది. ఇక ఇప్పుడు హర్ష సాయి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతానికి హర్ష సాయి కూడా తానూ ఏ తప్పు చేయలేదని అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. మరి ఈ కేసును దర్యాప్తు చేసే కొద్దీ ఇంకా ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి.

మరి ఈ ముగ్గురు విషయంలో ఎవరిదీ తప్పు ఎవరిదీ ఒప్పు అనే విషయంపై మాత్రం.. ఇప్పటికీ ఎవరికీ ఏ క్లారిటీ లేదు. ఎందుకంటే హీరోల పాపులారిటీని వాడుకుని.. వారి జీవితాలను నాశనం చేయడానికే.. బాధితురాళ్ళు ఇలా చేశారా! లేదా  వారిపై నిజంగానే ఆ అఘాయిత్యాలు జరిగాయి కాబట్టే.. అంత దైర్యంగా మీడియా ముందుకు వచ్చారా! లేదా దీనివెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా! ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఇండస్ట్రీలో ఇలాంటి ముసుగు వేసుకున్న వారు ఇంకా ఎంత మంది ఉన్నారో ఏమో అంటూ నెట్టింట గుసగుసలాడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş