iDreamPost
android-app
ios-app

’జో‘ మూవీ కాంబో రిపీట్.. ఈ సారి లవ్ స్టోరీ కాదట

  • Published May 04, 2024 | 1:42 PM Updated Updated May 04, 2024 | 1:42 PM

ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది కోలీవుడ్ థియేటర్లలోకి వచ్చి సందడి చేసిన మూవీ జో. తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యి.. టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు. . ఇప్పుడు

ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది కోలీవుడ్ థియేటర్లలోకి వచ్చి సందడి చేసిన మూవీ జో. తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యి.. టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు. . ఇప్పుడు

  • Published May 04, 2024 | 1:42 PMUpdated May 04, 2024 | 1:42 PM
’జో‘ మూవీ కాంబో రిపీట్.. ఈ సారి లవ్ స్టోరీ కాదట

ఇండస్ట్రీలో ప్రేమ కథలకు దక్కిన ఆదరణ..మరే జోనర్‌కు దక్కదు అనడంలో అతిశయోక్తి లేదు. కొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు ముఖ్యంగా యువత ఇలాంటి చిత్రాలను బాగా ఓన్ చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అలాంటి లవ్ స్టోరీ చిత్రమే జో. కోలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో వీడియో జాకీ, టెలివిజన్ హోస్ట్ రియో రాజ్ హీరోగా నటించగా.. మాళవిక మనోజ్, భవ్య త్రిఖ హీరోయిన్లుగా నటించారు. రియో, మాళవిక మధ్య నడిచే లవ్ ట్రాక్‌కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ మూవీ తెలుగులో కూడా డబ్బై ఓటీటీలో అలరించింది. మాళవిక నటనకు ఫిదా అయిపోయారు అభిమానులయ్యారు. ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది ఈ సోయగం.

ఇప్పుడు హిట్ పెయిర్ కాంబోలో మరో సారి రిపీట్ కానుంది. డ్రమాటిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మణికంఠన్ కందస్వామి సమర్పణలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు రియో అండ్ మాళవిక. బ్లాక్ షిప్ కలైయరసన్ తంగవేలు దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇందులో బ్లాక్ షీప్ ఆర్జే విగ్నేష్, షాలా రాజ కుమార్, ఏ వెంకటేశ్, గజరాజన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మధేశ్ మాణిక్ సినిమాటోగ్రాఫర్‌గా అందిస్తుండగా.. సిద్ది కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈసారి లవ్ జోనర్ కాదు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా రాబోతుంది. పెళ్లయ్యాక స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను పురుషులు అంగీకరించినట్లే.. పెళ్లైన మగ వాళ్ల సమస్య స్త్రీలు కూడా యాక్సెప్ట్ చేయాలన్న కాన్సెప్టుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'Joe' movie combo repeat

పెళ్లైయ్యాక భర్తలు పడే ఇబ్బందులు ఇందులో చూపించనున్నట్లు సమాచారం. ఈ కాన్సెప్టుతో కొత్త కథలేమీ రావడం లేదని తెలుస్తోంది. బ్లాక్ షీప్ సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను పంచుకోనున్నట్లు తెలిసింది. మరోసారి ఈ కెమిస్ట్రీ అలరించనుందని తెలుస్తోంది. హరి ముత్తయ్య వంటి డైరెక్టర్స్ తో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన డ్రమాటిక్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తుంది. ఇక మాళవిక విషయానికి వస్తే జో మూవీలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు పడిపోయారు. దీంతో మాళవికకు తెలుగులో నటించే అవకాశం కొల్లగొట్టింది. వర్సటైల్, యంగ్ హీరో సుహాస్ హీరోగా వస్తున్న ఓ భామ అయ్యో రామ చిత్రంలో టీటౌన్ ఎంట్రీ ఇస్తుంది ఈ భామ. ఈ సినిమా హిట్ అయితే.. వరుస ఆఫర్లు రావడం ఖాయం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş