iDreamPost
android-app
ios-app

Jhanvi Kapoor: ‘దేవర’ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన జాన్వీ కపూర్‌ !

  • Published Dec 04, 2023 | 5:50 PM Updated Updated Dec 04, 2023 | 5:50 PM

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. దేవర షూటింగ్‌ శరావేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం జాన్వీ తెలుగు నేర్చుకుంటున్నారు. డైలాగులు సొంతంగా చెబుతున్నారు...

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. దేవర షూటింగ్‌ శరావేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం జాన్వీ తెలుగు నేర్చుకుంటున్నారు. డైలాగులు సొంతంగా చెబుతున్నారు...

  • Published Dec 04, 2023 | 5:50 PMUpdated Dec 04, 2023 | 5:50 PM
Jhanvi Kapoor: ‘దేవర’ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన జాన్వీ కపూర్‌ !

స్టార్‌ కిడ్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్‌. తక్కువ సినిమాలే చేసినా దేశ వ్యాప్తంగా స్టార్‌ డమ్‌ తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఆమె సౌత్‌లో తొలి సినిమా చేస్తున్నారు. అది కూడా తెలుగులో.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. దేవరలో ఈ ఇద్దరూ జంట కాబోతున్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. షూటింగ్‌ ప్రారంభమైన చాలా నెలల తర్వాత జాన్వీ షూటింగ్‌లో పాల్గొన్నారు.

షూటింగ్‌ కోసం తెలుగు డైలాగులు నేర్చుకుని మరీ చెబుతూ ఉన్నారు. ఇక, తెలుగులో దేవర సినిమా చేయటంపై జాన్వీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవర చిత్రంలో పనిచేయటం తల్లి శ్రీదేవితో ఉన్నట్లుగా ఉందని అన్నారు. సౌత్‌ తన సొంతిళ్లని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలన్నారు. జాన్వీ మాట్లాడుతూ.. ‘‘ దేవర నా తొలి తెలుగు సినిమా. నాకు తెలుగు రాదు. ఇప్పుడు డైలాగ్స్‌ నేర్చుకోవటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను.

మా ఇంట్లో అమ్మ హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది. కానీ, అప్పుడప్పుడు చెన్నై వెళ్లిపోయినపుడు తమిళంలో మాట్లాడేది. అందుకే నాకు తెలుగు కంటే తమిళమే బాగా తెలుసు. దేవర సినిమాలో పని చేయటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉంది. మా అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా ఉంది. షూటింగ్‌ స్పాట్‌ మొత్తం అలానే అనిపిస్తుంది. అందరూ నా వాళ్లే అనిపిస్తుంది. సౌత్‌లో.. అది కూడా తెలుగులో సినిమా చేయటం అమ్మతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదో ఆధ్యాత్మికమైన విషయం’’ అని అన్నారు.

కాగా, జాన్వీ కపూర్‌ 2018లో వచ్చిన ధడక్‌ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరాఠీ భాషలో సూపర్‌ హిట్‌ అయిన సైరట్‌ సినిమాకు రీమేక్‌గా ‘ధడక్‌ ’ తెరకెక్కింది. అయితే, మరాఠీ భాషలో సాధించినంత విజయం.. హిందీలో సాధించలేకపోయింది. ధడక్‌ విడుదలైన రెండేళ్ల తర్వాత జాన్వీ నటించిన గోస్ట్‌ స్టోరీస్‌ విడుదలైంది. గెలుపోటములతో సంబంధం లేకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు.

ఆమె నటించిన మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి, ఉలజ్‌ సినిమాలు షూటింగ్‌ ముగించుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. ఇక, దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ కొన్ని నెలల క్రితమే ధ్రువీకరించారు. రెండు భాగాల్లోనూ జాన్వీ పాత్ర ఉండనుంది. మరి, దేవర సినిమాపై జాన్వీ కపూర్‌ చేసిన ఎమోషనల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet