iDreamPost
android-app
ios-app

‘జ్యువెల్ థీఫ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

  • Published Oct 28, 2024 | 6:04 PM Updated Updated Oct 28, 2024 | 6:04 PM

Jewel Thief: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అయ్యింది. జ్యువెల్ థీఫ్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆ తేదీ నాడు థియేటర్లలో సందడి చేయనున్నది.

Jewel Thief: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అయ్యింది. జ్యువెల్ థీఫ్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆ తేదీ నాడు థియేటర్లలో సందడి చేయనున్నది.

  • Published Oct 28, 2024 | 6:04 PMUpdated Oct 28, 2024 | 6:04 PM
‘జ్యువెల్ థీఫ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది జ్యువెల్ థీఫ్ మూవీ. సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది స‌బ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్ లో పాటలను గ్రాండ్ గా చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. హీరో కృష్ణ సాయి డాన్స్ , మేనరిజమ్స్ , హెయిర్ స్టైల్ సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తుండటం విశేషం.

పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను నవంబర్ 8న విడుద‌ల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టీన‌టులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. నిర్మాత మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జ్యువెల థీప్ ‘ మూవీ చాలా బాగా వచ్చింది. కథ , స్క్రీన్ ప్లే , ఎం ఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ మా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి…ఇటీవలే రిలీజైన ట్రైలర్ ,ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి.

మా హీరో కృష్ణసాయి బాగా నటించారు..ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వస్తుంది.. ఆయనతో పాటు సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి బాగా నటించారు. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. నవంబర్ 8 న విడుదల కాబోతున్న మా సినిమా ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్ లో ‘జ్యువెల్ థీఫ్’ సినిమా చూసి మా టీమ్ ను సపోర్ట్ చెయ్యాలని అన్నారు. ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, స‌మ్మెట గాంధీ, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి తదితరులు నటిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet