iDreamPost
android-app
ios-app

అఫీషియల్: విడాకులు తీసుకున్న జయం రవి- ఆర్తి

  • Published Sep 09, 2024 | 1:08 PM Updated Updated Sep 09, 2024 | 1:08 PM

Jayam Ravi: కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంది. క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి- ఆర్తి రవి విడిపోయారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు రవి.

Jayam Ravi: కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంది. క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి- ఆర్తి రవి విడిపోయారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు రవి.

  • Published Sep 09, 2024 | 1:08 PMUpdated Sep 09, 2024 | 1:08 PM
అఫీషియల్: విడాకులు తీసుకున్న జయం రవి- ఆర్తి

సినీ ఇండస్ట్రీలో సమంత- నాగ చైతన్య, ధనుష్- ఐశ్వర్య, జీవి ప్రకాష్-సైంధవి డివోర్స్ ఎనౌన్స్ అభిమానుల్ని ఆవేదనకు గురిచేశాయి. అంతలో ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకున్నారంటూ రూమర్స్ వచ్చాయి. కాగా, దీని కన్నా ముందే మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. దీన్నే నిజం చేస్తూ విడాకులు ప్రకటించింది ఆ జంట. తమిళ స్టార్ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి తమ వైవాహిక బంధానికి స్వస్థి పలికారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు జయం రవి. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ నోట్ పంచుకున్నాడు. గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య విబేధాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. భార్యా భర్తలిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి జీవిత భాగస్వామితో ఉన్న కొన్ని ఫోటోలు తీసేయడంతో విడాకుల వార్తలకు ఊతమిచ్చినట్లు అయ్యింది.

తాజాగా విడాకులకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు జయం రవి. ‘జీవితం అనేది వివిధ చాప్టర్లతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లు ఎదురౌతుంటాయి. తెరమీదే కాదు.. తెర వెనుక కూడా తన పట్ల ఎంతో మంది ప్రేమ, మద్దతు చూపించారు. నా అభిమానులు, మీడియాతో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఓ బాధకరమైన విషయాన్ని చెప్పాలనకుంటున్నాను. ఆర్తితో నా వివాహ బంధానికి స్వస్థి పలుకుతున్నా. ఇది ఎంతో కఠినంతో తీసుకున్న నిర్ణయం. మా వ్యక్తిగత, మా కుటుంబ సభ్యుల గోపత్యను గౌరవించండి. అలాగే ఈ క్లిష్ట సమయంలో ఎలాంటి ఊహలు, పుకార్లు, ఆరోపణలు చేయోద్దు’ అంటూ సుదీర్ఘమైన నోట్ పంచుకున్నాడు హీరో.  కాగా, ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు జూన్ నుండే వార్తలు వచ్చాయి.

కాగా, తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్‌ కూతురే ఆర్తి. 2009లో ఆర్తిని వి వాహం చేసుకున్నాడు జయం రవి. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో రవి, ఆర్తి జంట క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. కానీ కొన్ని రోజుల నుండి ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని స్థానిక మీడియా కోడై కూసింది. అంతలోనే తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికింది ఈ జంట. ఎడిటర్ మోహన్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన రవి.. చైల్ట్ ఆర్టిస్టుగా బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి చిత్రాలు చేసి.. జయం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి జయం రవి అన్న పేరు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ ఏడాది సైరన్ మూవీతో హిట్ అందుకున్న రవి.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio