iDreamPost
android-app
ios-app

నటి జయలలిత షాకింగ్ కామెంట్స్.. సీనియర్ నటుడు తలుపులు కొట్టి..

  • Published Mar 11, 2024 | 10:10 PM Updated Updated Mar 11, 2024 | 10:10 PM

Jayalalitha Shocking Comments: ప్రముఖ నటి జయలలిత గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె ప్రధానంగా వ్యాంప్ పాత్రలతో బాగా పాపులర్ అయ్యింది.

Jayalalitha Shocking Comments: ప్రముఖ నటి జయలలిత గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె ప్రధానంగా వ్యాంప్ పాత్రలతో బాగా పాపులర్ అయ్యింది.

  • Published Mar 11, 2024 | 10:10 PMUpdated Mar 11, 2024 | 10:10 PM
నటి జయలలిత షాకింగ్ కామెంట్స్.. సీనియర్ నటుడు తలుపులు కొట్టి..

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు తమ ప్రత్యేక క్యారెక్టర్స్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కొంతమంది కామెడీ, విలన్, వ్యాంప్, ఐటమ్ సాంగ్స్ తో మంచి క్రేజ్ సంపాదించారు. అలాంటి వారిలో ప్రముఖ నటి జయలలిత ఒకరు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన జయలలిత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా వ్యాంప్ పాత్రల్లోనే నటించారు. వెండితెరపై ఛాన్సులు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తనకు గౌరవమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. తాజాగా ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అనుభవాల గురించి మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

నటి జయలలిత మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత మామూలు వ్యహారం కాదు. ఇక్కడ నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేయలేదు. చాలా మందితో లౌక్యంగా మాట్లాడుతూ కెరీర్ లో కొనసాగుతూ వచ్చాను. అప్పట్లో డ్యాన్సర్స్ తో డైరెక్టర్లు చాలా బాగా వ్యవహరించేవారు. ఇప్పడు అలాంటి వాళ్లు లేరని చెప్పడం లేదు. అప్పట్లో డైరెక్టర్లు నటీమణులకు అన్ని రకాల క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్లు. మా తరానికి వచ్చే సరికి.. వ్యాంప్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా వచ్చింది. వ్యాంప్ క్యారెక్టర్స్ అంటే ఒక రకంగా ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. నాకు ఇండస్ట్రీలో వచ్చిన ఛాన్సులు అన్నీ సద్వినియోగం చేసుకుంటూ వచ్చాను. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సెట్ లోకి వెళ్తే ఆ ఫోన్లు పక్కన బెట్టేవాళ్లం.

ఇండస్ట్రీ అన్న తర్వాత ఆడవాళ్లకు ఇబ్బందులు అనేవి సహజం. అప్పట్లో వ్యాంప్ పాత్రల్లో నటించడం  వల్ల కొంతమంది ఏదో రకంగా భావించేవాళ్లు. కాస్త అందంగా ఉంటాను.. మంచి పర్సనాలిటీ.. అది చూసి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు వెంటపడేవాళ్లు. ఇండస్ట్రీలో సాధారణంగా తలుపులు కొట్టడం, అడగడం కామన్. ఓ పెద్ద ఆర్టిస్ట్ అయితే ఏకంగా తలుపులు తీస్తావా? ఇక్కడే ఉరి వేసుకోవాలా ? అని బెదిరించాడు. అయినా కూడా నేను బెదిరిపోలేదు. ఎలా తప్పించుకోవాలో అలా తప్పించుకునేదాన్ని. కొంత మంది మగాళ్ల నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేసేదాన్ని.. కుదరకపోతే లొంగిపోయేదాన్ని. తన కోరిక తీర్చలేదన్న కారణంతో ఓ డైరెక్టర్ షూటింగ్ మధ్యలోనే నన్ను వెళ్లిపోమ్మన్నాడు. అలా కూడా జరుగుతుంటాయి.  ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను నా పరిస్థితి బాగా లేకపోయినా.. నా వాళ్లు బాగుండాలనే కోరుకున్నాను. ఒక వయసు వచ్చాక తోడు కావాలి కదా పెళ్లి కాకపోతే కనీసం ఒక పిల్లను అయినా పెంచుకోవ అని సలహా ఇచ్చారు. కానీ నాకేదీ వద్దని చెప్పాను. ఇప్పుడు నా వాళ్లంతా సెటిల్ అయ్యారు’ అంటూ చెప్పుకొచ్చారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş