iDreamPost
android-app
ios-app

తెలుగు ప్రేక్షకులంతా సెలబ్రేట్ చేసుకునేలా ‘జాతర’ ఉంటుంది: హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ

  • Published Nov 04, 2024 | 4:59 PM Updated Updated Nov 04, 2024 | 4:59 PM

Jathara Movie: సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Jathara Movie: సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

  • Published Nov 04, 2024 | 4:59 PMUpdated Nov 04, 2024 | 4:59 PM
తెలుగు ప్రేక్షకులంతా సెలబ్రేట్ చేసుకునేలా ‘జాతర’ ఉంటుంది: హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ

గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జాతర’ . ఈ మూవీలో హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించారు సతీష్ బాబు రాటకొండ. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను తన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ. సాధారణంగా  దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో చెబుతుంటే వినేవాళ్లం. కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తుంటాడు. ఆ పితలాటకం నుంచి అమ్మవారిని హీరో ఎలా రక్షిస్తాడు అనేది ఈ చిత్ర మూల కథాంశం. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా ‘జాతర’ చిత్రంలో చూపిస్తున్నాం. ఈ మూవీ వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షన్ యాడ్ చేసి  రూపొందించాను. వాస్తవానికి ఈ సినిమాని డాక్యుమెంటరీగా తీయాని చూసినా కొన్ని వివాదాలు వస్తాయని విరమించుకున్నారు.  సినిమా అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించవొచ్చన్న ఉద్దేశంతో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక జాతర మూవీలో హీరో పాత్ర మూడు విభిన్నడైమెన్షన్స్ లో ఉంటుంది. అతను ఒక ఫేజ్ నుంచి మరో ఫేజ్ కు వెళ్లేందుకు ప్రేమ అనేది ఒక మీడియంలా ఉంటుంది. అలా ఈ కథలో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. మంచి సౌండ్ డిజైనింగ్ ఈ మూవీ కోసం చేశాం. మనం జంధ్యాల గారి సినిమాల్లో విన్నట్లు విలేజ్ లో వినిపించే సహజమైన సౌండ్స్ తరహాలో ‘జాతర’ చిత్రంలో సౌండ్ డిజైనింగ్ చేయించాం. 2016లోనే ‘జాతర’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ఒక సందర్భంలో ప్రొడ్యూసర్ నాకు అనుకోకుండా ఓ ఫంక్షన్ లో కనిపించారు. ఆ పరిచయంతో నేను జాతర మూవీ పాయింట్ ఆయనకు చెప్పాను. ఆ కథ నచ్చి ఆయన వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తోనూ డిస్కస్ చేశారు. వాళ్లకు కూడా నచ్చడంతో ఓకే చెప్పారు . వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. మరో అదృష్టం ఏంటేంటే ఈ సినిమాను నన్నే డైరెక్ట్ చేయమని ప్రొడ్యూసర్ చెప్పారు.  మా ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సినిమా చేయడంలో ఎంతో సపోర్ట్ అందించారు.  చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఈ అమ్మవారి ఫేమస్. ఆ గుడికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.  చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయి, రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ చేసుకున్నాం. గంగమ్మతల్లిని తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భావిస్తున్నా.

వాస్తవానికి ఈ సినిమా ఓ పెద్ద హీరోతో తీయాల్సింది. కానీ మాకు అలా అప్రోచ్ అయ్యే దారి తెలియదు. అప్పటికీ ఆరు నెలల పాటు ప్రయత్నించినా కుదరలేదు. దాంతో నేనే హీరోగా నటించాను. ‘జాతర’ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులను పెడదామని ప్రపోజల్ వచ్చినా నేను వద్దని చెప్పాను. ఇది స్థానిక మూలాలున్న కథ. అక్కడి నటీనటులు అయితేనే సహజంగా ఉంటుందని భావించాం. అలాగే తెలుగు తెలిసిన హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నించినా మా బడ్జెట్ కు కుదరలేదు. దీయా రాజ్ బాగా యాక్ట్ చేసింది. జాతర మూవీకి యూఎస్, యూకేలో ఫిలింస్ కు వర్క్ చేసే మూవీ టెక్ అనే కంపెనీ ప్రొడక్షన్ లో జాయిన్ అయి ఎంతో సపోర్ట్ చేసింది. మూవీ టెక్ నుంచి అలెక్స్ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ టైమ్ లో టెక్నికల్ గా చూసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే ప్యాషన్..నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగాలని ఉంది. దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. వారి స్ఫూర్తితోనే ‘జాతర’ సినిమా చేశాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతాను. త్వరలో మరికొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet