iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఆ హీరో కుట్ర.. జానీ భార్య సంచలన కామెంట్స్

  • Published Sep 20, 2024 | 9:01 PM Updated Updated Sep 20, 2024 | 9:01 PM

Jani Master: జానీ మాస్టర్ పై నమోదైన లైంగిక ఆరోపణల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టు అయిన జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జానీ భార్య సంచలన కామెంట్స్ చేసింది.

Jani Master: జానీ మాస్టర్ పై నమోదైన లైంగిక ఆరోపణల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టు అయిన జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జానీ భార్య సంచలన కామెంట్స్ చేసింది.

  • Published Sep 20, 2024 | 9:01 PMUpdated Sep 20, 2024 | 9:01 PM
జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఆ హీరో కుట్ర.. జానీ భార్య సంచలన కామెంట్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన వద్ద వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని బాధితురాలు కంప్లైంట్ లో పేర్కొనడంతో జానీపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ కోసం సెర్చ్ చేయడం ప్రారంభించారు.

అతను గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత విచారణ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరపరిచారు. కేసు విచారణ చేసిన కోర్టు జానీకి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జానీని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. లైంగిక ఆరోపణలపై స్పందించిన జానీ భార్య తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. కోర్టులో న్యాయం జరుగుతుందని నిర్ధోషిగా బయటకు వస్తాడని తెలిపింది. ఈ క్రమంలో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది జానీ భార్య ఆయేషా. జానీ మాస్టర్ అరెస్టు వెనక ఆ హీరో హస్తం ఉందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ టాపిక్ మరింత బర్న్ అవుతున్నది.

జానీ భార్య ఆయేషా మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనిక ఫ్రూఫ్ ఏంటీ అని ప్రశ్నించింది. ఇన్ని ఏళ్లుగా ఎందుకు బయటకు రాలేదు. ఇప్పుడు ఎందుకు లైంగిక ఆరోపణలు చేస్తుంది. ఇది తప్పుడు కేసు. కానీ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుతున్నారు. ఏ సపోర్ట్ లేకుండా రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇది చూసి ఓర్వలేకనే తక్కేయాలని చూస్తున్నారు అని తెలిపింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటూ తనకున్న అనుమానాన్ని బయటపెట్టింది ఆయేషా. సుకుమార్ కు ఈ వ్యవహారం అంతా తెలుసు అన్నట్టుగా జానీ భార్య వెల్లడించింది. మాస్టర్ ఆ అమ్మాయికి చేసిన మంచి ఈ రోజు శాపంగా మారింది. కెరీర్ కోసం మాస్టర్ ని వాడుకుంది. తను మాస్టర్ ను ఇష్టపడింది. రెండో పెళ్లైనా పర్లేదు కెరీర్ బాగుంటే చాలనుకుంది. మంచి దానిలా నటించింది. కో-డ్యాన్సర్స్ ను పిలిచి ఎంక్వైరీ చేయించండి అసలు నిజాలు బయటికి వస్తాయని కోరింది.

ఆ అమ్మాయి మా యింటికి చాలా సార్లు వచ్చింది. వాళ్ల అమ్మ కూడా వచ్చింది. ఇంత జరుగుతుంటే ఆ అమ్మాయి వాళ్ల అమ్మ ఎందుకు మాట్లాడటం లేదు అని జానీ భార్య ప్రశ్నించింది. ఆ అమ్మాయిది సైకో మెంటాలిటీ. ఆమెకు హీరోయిన్ అవ్వాలని కోరిక దీనికోసం మాస్టర్ ను వాడుకోవాలని చూసింది. శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇప్పించిందే జానీ మాస్టర్. అలాంటిది జానీ మాస్టర్ ఆమెను ఇలా చేశాడంటే నమ్మేదెలా. 14 సంవత్సరాలుగా ఆయనతో కాపురం చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జానీ ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించింది. ఏది ఏమైనా కుట్రదారులు ఎవరన్నది బయటికి వస్తుంది. కోర్టులో న్యాయం జరుగుతుంది. జానీ నిర్థోషిగా బయటకు వస్తారని ఆయేషా వెల్లడించింది. మరి జానీ అరెస్టు వెనక ఆ హీరో హస్తం ఉందంటూ ఆయేషా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet