iDreamPost
android-app
ios-app

జైలర్ నిర్మాత ఎక్కడా తగ్గట్లేదు! వాళ్లకు కార్లు, వీళ్లకు గోల్డ్ కాయిన్లు!

  • Author ajaykrishna Updated - 01:14 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 01:14 PM, Mon - 11 September 23
జైలర్ నిర్మాత ఎక్కడా తగ్గట్లేదు! వాళ్లకు కార్లు, వీళ్లకు గోల్డ్ కాయిన్లు!

ఈ మధ్యకాలంలో సినిమాలు సక్సెస్ అయితే నిర్మాతల సందడి మామూలుగా ఉండట్లేదు. ఇదివరకు సినిమాలు హిట్ అయితే హీరోలు, హీరోయిన్స్ నుండి రియాక్షన్ చూసేవాళ్ళం. కానీ.. ఇప్పుడా రోజులు మారిపోయాయి. నిర్మాతలే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసేస్తున్నారు. సినిమా హిట్టయితే హీరోలు, దర్శకులకు ఖరీదైన కార్లు బహుమానంగా ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా జైలర్ సినిమా విజయాన్ని ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఎలా సెలబ్రేట్ చేశారో చూశాం. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. డాక్టర్, బీస్ట్ మూవీస్ తర్వాత నెల్సన్ రూపొందించిన మూవీ ఇది.

సూపర్ స్టార్ రజినీ హీరోగా నటించడమే కాకుండా.. రమ్యకృష్ణ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలు పోషించడం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక అనిరుధ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదే హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కట్ చేస్తే.. జైలర్ మూవీ థియేటర్స్ లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా చేరింది. ఊహించని విధంగా రూ. 650 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడం విశేషం. అయితే.. జైలర్ మూవీ సక్సెస్ ని ప్రొడ్యూసర్ మూవీ టీమ్ అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రజినీకి బిఎండబ్ల్యూ కారుతో పాటు చెక్ ఇచ్చారు.

అంతేగాక డైరెక్టర్ నెల్సన్ కి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు కూడా ప్రొడ్యూసర్ కళానిధి మారన్.. కార్లు, చెక్కులు అందించారు. దీంతో కేవలం మెయిన్ టీమ్ కే గిఫ్ట్స్ ఇచ్చాడని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా జైలర్ సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరికి.. అంటే దాదాపు 300 మందికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చి.. 300 గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జైలర్ సక్సెస్ ని మూవీ టీమ్ తో పాటు రజినీ ఫ్యాన్స్ అందరు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ మూవీ టీమ్ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి.. అందరి మనసులు గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా.. రజినీ, కళానిధి మారన్ కాంబినేషన్ లో ‘తలైవార్171’ మూవీ రాబోతుంది. వీరి కాంబోలో రోబో, జైలర్ ల తర్వాత వస్తున్న సినిమాకు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేస్తున్నాడు. మరి ఈ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş