iDreamPost
android-app
ios-app

విషాదం.. ‘జైలర్’లో డ్యాన్స్ అదరగొట్టి.. సక్సెస్ చూడకుండానే కన్నుమూసిన నటుడు!

  • Author ajaykrishna Updated - 08:55 AM, Fri - 18 August 23
  • Author ajaykrishna Updated - 08:55 AM, Fri - 18 August 23
విషాదం.. ‘జైలర్’లో డ్యాన్స్ అదరగొట్టి.. సక్సెస్ చూడకుండానే కన్నుమూసిన నటుడు!

సూపర్ స్టార్ రజినీ నటించిన లేటెస్ట్ బ్లాక్ మూవీ జైలర్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. వసూళ్ల పరంగాను ఊహించని నెంబర్స్ నమోదు చేస్తోంది. అయితే.. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. అటు యాక్షన్ పరంగా, ఇటు కామెడీ పరంగా అన్నివిధాలా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్ తర్వాత రజినీ సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. జైలర్ సక్సెస్ తో అందులో భాగమైన నటినటులు.. మిగతా కాస్ట్ అందరు హ్యాపీనే. కానీ.. ఈ సినిమాలో విలన్ కి డ్యాన్స్ అసిస్టెంట్ గా కనిపించిన టిక్ టాక్ రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు లేడు అని ఎంతమందికి తెలుసు?

జైలర్ లో విలన్ వర్మ.. ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకుంటూ మధ్యమధ్యలో డ్యాన్స్ చేస్తుంటాడు. అతనితో డ్యాన్స్ చేసేవారిలో ఓ వ్యక్తి లుంగీ కట్టుకొని.. డ్యాన్స్ అదరగొడతాడు. అతనే టిక్ టాక్ రమేష్. తన డ్యాన్స్ వీడియోలతో టిక్ టాక్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పాపులర్ అయిన రమేష్ గురించి నెటిజన్స్ కి పరిచయమే. లుంగీలోనే క్లాసికల్ డ్యాన్స్, మైఖేల్ జాక్సన్ స్టెప్స్ తో డాన్స్ బాగా చేస్తాడని రమేష్ కి పేరుంది. నడిరోడ్డుపై మైఖేల్ జాక్సన్ బాడీ లాంగ్వేజ్ తో ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు చేసి.. క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ జైలర్ లో నటించాడు. కానీ.. సినిమా రిలీజ్ కి కొన్ని నెలల ముందే చనిపోవడం విషాదకరం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. తన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన టిక్ టాక్ రమేష్.. టాలెంట్ చూసి స్టార్ హీరో అజిత్ ‘తునివు’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ నెల్సన్ రజినీ జైలర్ లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే.. జైలర్ రిలీజ్ కి ముందే రమేష్ అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది జనవరిలో మరణించాడట. ఈ విషయం తెలిసి సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అదేంటి రమేష్ ఇప్పుడు లేడా? ఉంటే జైలర్ సక్సెస్ తో ఎన్ని అవకాశాలు వచ్చేవో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాక్సాఫీస్ వద్ద జైలర్ మూవీ రూ. 450 కోట్లు కలెక్షన్స్ దాటి పరుగులు పెడుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించి.. ఎలివేట్ చేశాడు. మరి జైలర్ లో రమేష్ డ్యాన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by E L L A T H A I Y U M P E S U V O M (@ellathaiyum_pesuvom)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet