iDreamPost
android-app
ios-app

జైలర్‌కు లాభాల పంట.. డైరెక్టర్‌కు కాస్ట్లీ కారు గిఫ్ట్‌.. తర్వాత అనురుధ్‌కే!

  • Published Sep 02, 2023 | 10:42 AM Updated Updated Sep 02, 2023 | 10:42 AM
  • Published Sep 02, 2023 | 10:42 AMUpdated Sep 02, 2023 | 10:42 AM
జైలర్‌కు లాభాల పంట.. డైరెక్టర్‌కు కాస్ట్లీ కారు గిఫ్ట్‌.. తర్వాత అనురుధ్‌కే!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్‌ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం విజయంతో బాక్సాఫీస్‌ వద్ద రజనీ క్రేజ్‌ ఏమాత్రం చెక్కుచెదరలేదని మరోసారి ప్రూవ్‌ అయ్యింది. జైలర్‌ చిత్రం ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. సన్‌పిక్చర్స్‌ యజమాని కళానిధి మారన్‌.. రజనీకాంత్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు.. బీఎండబ్ల్యూ కారును కూడా బహుకరించారు. ఇక తాజాగా డైరెక్టర్‌ వంతు. ఈ క్రమంలో జైలర్‌ దర్శకుడు నెల్సన్‌కు కూడా కళ్లు చెదిరె గిఫ్ట్‌ ఇచ్చారు కళానిధి మారన్‌. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వివరాలు..

జైలర్‌ దర్శకుడు నెల్సన్‌కు కాస్ట్‌లీ పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. కారు మాత్రమే కాక.. నెల్సన్‌కి కూడా నిర్మాతల నుంచి భారీ చెక్‌ అందినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఖరీదైన కారు, చెక్‌ బహుమతిగా ఇవ్వడంతో.. నిర్మాత కళానిధి మారన్‌కు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు నెల్సన్‌. ఇక జైలర్‌ విజయంలో మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో త‍్వరలోనే అనురుధ్‌కి కూడా ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నట్లు సమాచారం.

జైలర్‌ సినిమాకు భారీగా లాభాలు రావడంతో.. రజనీపై కనకవర్షం కురపించారు మేకర్స్‌. జైలర్‌ సినిమాకు ఓకే చెప్పడానికి ముందుగానే రజనీ ఒప్పదం చేసుకున్నారట. దాని ప్రకారం.. జైలర్‌ సినిమాకు రెమ్యూనరేషన్‌తో పాటు.. ప్రాఫిట్‌లో కొంత భాగం రజనీకి ఇచ్చారు చిత్ర నిర్మాత కళానిధి మారన్. తలైవాకు చెక్కు అందజేస్తోన్న ఫొటోను సన్ పిక్చర్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ చెక్కు ద్వారా ఎంత ఇచ్చారు అనేది చెప్పకపోయినా.. ఇది సుమారు రూ.100 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెమ్యునరేషన్ కింద జైలర్‌ సినిమా కోసం రజనీ రూ.110 కోట్లు తీసుకున్నారని టాక్. ఇప్పుడు ఈ రూ.100 కోట్లు అదనమని అంటున్నారు. దాంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజనీ రికార్డు సృష్టించారని చెబుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet