iDreamPost
android-app
ios-app

సాధువు సంచలన ప్రకటన.. ఉదయనిధి తల నరికితే రూ. 10 కోట్లు!

  • Published Sep 05, 2023 | 8:26 AM Updated Updated Sep 05, 2023 | 8:26 AM
  • Published Sep 05, 2023 | 8:26 AMUpdated Sep 05, 2023 | 8:26 AM
సాధువు సంచలన ప్రకటన..  ఉదయనిధి తల నరికితే రూ. 10 కోట్లు!

డీఎంకే పార్టీ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. దీంతో హిందువులంతా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అయోధ్య సాధువు జగద్గురు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వారికి ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కత్తితో ఉదయనిధి స్టాలిన్‌ ఫొటోను పొడిచి ‘‘నేను పదికోట్ల నజరానా ప్రకటిస్తున్నారు. ఎవరైతే.. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ తల తెచ్చి ఇస్తారో వారికి ఆ డబ్బులు ఇస్తాను. ఎవ్వరూ ఆ తల తేలేకపోతే.. నేనే స్వయంగా అతడి తల నరుకుతాను’’ అని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది సాధువు సపోర్టు చేస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రామ్‌ చరణ్‌ పా ట్వీట్‌  ఒకటి వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ఆయన ‘సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం’ అని రాసుకొచ్చారు. తన తల్లి సురేఖ తులసి కోటకు పూజ చేస్తున్న ఫొటోను జత చేశారు. మరి, అయోధ్య సాధువు చేసిన సంచలన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet