iDreamPost
android-app
ios-app

రీతూ చౌదరి బ్రేకప్ అంటూ వార్తలు! ఒక్క పోస్ట్ తో క్లారిటీ!

  • Author ajaykrishna Updated - 09:52 AM, Sat - 19 August 23
  • Author ajaykrishna Updated - 09:52 AM, Sat - 19 August 23
రీతూ చౌదరి బ్రేకప్ అంటూ వార్తలు! ఒక్క పోస్ట్ తో క్లారిటీ!

జబర్దస్త్ బ్యూటీ, సీరియల్ నటి రీతూ చౌదరి గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు సీరియల్స్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన గ్లామర్ షోతో ట్రెండ్ అవుతోంది. బుల్లితెరపై కెరీర్ మొదలుపెట్టిన రీతూ.. నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతూ తన పని తాను చేసుకుంటోంది. అయితే.. సెలబ్రిటీలకు సంబంధించి లవ్, రిలేషన్ షిప్స్, బ్రేకప్ విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు ఫ్యాన్స్, నెటిజన్స్. లవ్ గురించి తెలిస్తే హ్యాపీనే.. కానీ, బ్రేకప్ అని తెలిస్తేనే సోషల్ మీడియాలో వైరల్ చేసేసి.. రచ్చ చేస్తుంటారు. ఇటీవల రీతూ చౌదరి విషయంలోను ఇలాంటి ప్రచారమే జరిగింది.

ఆ మధ్య రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్ లో పడిందంటూ ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణం లేకపోలేదు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఫాలోయర్స్ ని ఖుషి చేసే రీతూ.. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలు కూడా షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి ఫోటోలు పోస్ట్ చేసేసరికి.. అతను ఎవరు అనే చర్చలు జరిగాయి. అప్పుడే శ్రీకాంత్ తో కలిసున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. అతనితో ఉన్న రిలేషన్ కన్నా ఏది గొప్పది కాదంటూ సర్ప్రైజ్ చేసింది. దీంతో అందరి దృష్టిలో రీతూ, శ్రీకాంత్ లవ్ లో ఉన్నారని కన్ఫర్మ్ అనిపించుకుంది.

ఆ తర్వాత శ్రీకాంత్ రీతూ నుదుటిన ముద్దు పెట్టిన వీడియో వైరల్ అవ్వడంతో.. వీరు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పోస్టులు పెట్టలేదు.. పైగా రీతూ తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీకాంత్ రాలేదని.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని టాక్ మొదలైంది. అంతేగాక ఇద్దరు కలిసున్న ఫోటోలు కూడా డిలేట్ చేయడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొని.. పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది, హ్యాపీగా ఉండొచ్చని చెప్పుకొచ్చింది. దీంతో బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరింది. కట్ చేస్తే.. తాజాగా శ్రీకాంత్ తో కలిసున్న కొత్త పిక్ పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది రీతూ. దీంతో వీరి మధ్య బ్రేకప్ వార్తలకు చెక్ పడినట్లు అయ్యిందని సమాచారం. మరి రీతూ చౌదరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet