iDreamPost
android-app
ios-app

శ్మశానంలో గడిపేవాడిని.. నా కోసం సుజాత అక్కడికి వచ్చేది!రాకేష్

  • Published Nov 20, 2023 | 4:02 PM Updated Updated Nov 20, 2023 | 4:02 PM

జబర్దస్త్ కమిడియన్ రాకింగ్ రాకేష్ తన పెళ్లి విషయాలను పంచుకున్నారు. జోర్దార్ సుజాతతో పరిచయం, ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన గురువు సమాధి వద్ద గడిపే సమయంలో శ్మశానానికి కూడా వచ్చేదని వెల్లడించారు.

జబర్దస్త్ కమిడియన్ రాకింగ్ రాకేష్ తన పెళ్లి విషయాలను పంచుకున్నారు. జోర్దార్ సుజాతతో పరిచయం, ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన గురువు సమాధి వద్ద గడిపే సమయంలో శ్మశానానికి కూడా వచ్చేదని వెల్లడించారు.

  • Published Nov 20, 2023 | 4:02 PMUpdated Nov 20, 2023 | 4:02 PM
శ్మశానంలో గడిపేవాడిని.. నా కోసం సుజాత అక్కడికి వచ్చేది!రాకేష్

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియెన్స్ కి ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ బుల్లితెరపై టాప్ కామెడీ షోగా దూసుకెళ్తోంది. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు.. ఎంతో మంది ఆర్టిస్టులకు కెరీర్ ను అందించింది. జబర్దస్త్ వేదికపై చేసిన ప్రదర్శనలతో సినీ ఇండస్ట్రీలో ఆ నటీనటులకు సినీ అవకాశాలు క్యూకట్టాయి. ఇదిలా ఉంటే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అందరికి సుపరిచితమే. చిన్న పిల్లలతో స్కిట్స్ చేస్తూ కడుపుబ్బ నవ్వించే వారు. తాజాగా ఓ ఇటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సుజాత తో తన పెళ్లి, ఇంకా వ్యక్తి గత జీవితం గురించి వెల్లడించారు.

జబర్ధస్త్ షోలో కంటెస్టెంట్లుగా చేసిన రాకింగ్ రాకేష్, సుజాత మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కు మారిన ఈ జంట అదే రీతిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. జబర్ధస్త్ లో చేస్తూనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు సుజాత. న్యూస్ ఛానల్ లో చేసిన సమయంలో సుజాతకు జోర్ధార్ సుజాతగా మంచి పేరు వచ్చింది. రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను కూడా తీశారు. తాజాగా రాకేష్ సుజాతతో తన పరిచయం, పెళ్లి విషయాలను వివరించారు. సుజాతకు నాకు పరిచయం ఏర్పడింది ఓ న్యూస్ ఛానల్ లో అని రాకేష్ తెలిపారు. అప్పటి నుంచి మా జర్నీ ప్రారంభమైంది. మా ఇద్దరిది వరంగల్ జిల్లానే ఆమెది మా ఊరు పక్కనే.

ఆమె కూడా ఎన్నో కష్టాలను ఎదర్కొన్నారు. ఆ సమయంలో మణికొండలో మేము ఉండే దగ్గరే సుజాతకు ఓ ఇల్లు చూశాను. అప్పటి నుంచి సుజాత మా అమ్మతో కూడా కలిసిపోయింది. అప్పటి వరకు నాకు పెళ్లిపై పెద్దగా ఇంట్రస్టు లేదని తెలిపారు. మా గురువు గారు రాళ్ల పల్లి మరణించిన తర్వాత నేను ఆయన సమాధి వద్దనే ఎక్కువగా గడిపేవాడినని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సుజాత నా కోసం శ్మశానానికి వచ్చేదని తెలిపారు. మా ఇద్దరి మనసులు కలిశాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ మా పెళ్లి కోసం ఎక్కువ కష్టపడింది మాత్రం సుజాతనే. తనే వాళ్ల ఇంట్లో వాళ్లను ఒప్పించి, పెళ్లి పనులన్నింటిని కూడా తనే చూసుకుందని రాకేష్ తన పెళ్లినాటి విషయాలను పంచుకున్నారు. ఇక రాకేష్ తీసిన సినిమా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom