iDreamPost
android-app
ios-app

రంగు గురించి మాట్లాడేవారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఫైమా!

  • Published Oct 25, 2023 | 9:15 PM Updated Updated Oct 25, 2023 | 9:15 PM

ఈ సందర్భంగా ఫైమా తన రంగుపై ఎదురైన విమర్శల గురించి స్పందించింది. ఫైమా మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ నా కలర్‌ గురించి మాట్లాడేవారు ఉన్నారు.

ఈ సందర్భంగా ఫైమా తన రంగుపై ఎదురైన విమర్శల గురించి స్పందించింది. ఫైమా మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ నా కలర్‌ గురించి మాట్లాడేవారు ఉన్నారు.

  • Published Oct 25, 2023 | 9:15 PMUpdated Oct 25, 2023 | 9:15 PM
రంగు గురించి మాట్లాడేవారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఫైమా!

జబర్థస్త్‌ షోతో పిచ్చిపాపులారిటీ తెచ్చుకున్నారు ఫైమా షేక్‌. తనదైన శైలీ కామెడీ టైమింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయారు. ఆ ఛానల్‌, ఈ ఛానల్‌ అని కాకుండా.. అన్ని ఛానళ్లలో కనిపిస్తూ.. తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆమె తాజా షో ‘‘ తెలుగు మీడియం హైస్కూల్‌’’ షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. అతి త్వరలో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్‌ ఫైమాను తెలుగు మీడియం హైస్కూల్‌ సెట్‌లో ఇంటర్వ్యూ చేసింది.

ఈ సందర్భంగా ఫైమా తన రంగుపై ఎదురైన విమర్శల గురించి స్పందించింది. ఫైమా మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ నా కలర్‌ గురించి మాట్లాడేవారు ఉన్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే.. అప్పుడు నేను పట్టించుకున్నాను.. ఇప్పుడు పట్టించుకోవటం లేదు. మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఎవ్వరూ మనకు సాయం చేయరు. మనం పడిపోతే నవ్వే వాళ్లు తప్ప.. ఎత్తే వాళ్లు ఉండరు. మన కాళ్ల మీద మనం నిలబడాలి. మనం డిసైడ్‌ అవ్వాలి.. ఎవ్వరి మాటా వినకూడదు.

కొన్ని పరిస్థితులు ఎదురైనపుడు నేను ఆగిపోయి ఉంటే.. ఇక్కడ ఉండేదాన్ని కాదు.. దాన్ని దాటుకుని ఇంత వరకు వచ్చాను కాబట్టే.. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అని అన్నారు. కాగా, ఫైమా షేక్‌ ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. పటాస్‌ అనే స్టాండప్‌ కామెడీ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జబర్థస్త్‌తో ఆమెకు మంచి బ్రేక్‌ వచ్చింది. మరి, ఫైమా స్పూర్తిదాయక మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş