Nagendra Kumar
Item Songs No Please: కొంత కాలంగా హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉండగానే ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ తమ క్రేజ్ ని క్యాష్ గా చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఐటమ్ సాంగ్ కి నో చెప్పేస్తున్నారు.
Item Songs No Please: కొంత కాలంగా హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉండగానే ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ తమ క్రేజ్ ని క్యాష్ గా చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఐటమ్ సాంగ్ కి నో చెప్పేస్తున్నారు.
Nagendra Kumar
అతి తక్కువ టైంలో ఎక్కువ పాప్యులారిటీ సంపాదించుకున్న ఇటీవలి హీరోయిన్స్ లో శ్రీ లీల ఎక్కువ మార్కులే కొట్టేసింది. పెళ్ళి సందడి చిత్రంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా పరిచయమైన ఈ అమ్మడు వచ్చిన ప్రతీ సినిమాని ఒప్పేసుకుని, ప్రతీ సినిమాలోనూ తనే అన్నట్టుగా అయి కూర్చుంది. 2017లో సప్తగిరి తో పాటు మొట్టమొదట తెలుగులో చిత్రాంగద సినిమాతో వచ్చినా పెళ్ళి సందడి చిత్రమే లీలకి తెలుగులో బ్రేక్ ఇచ్చింది. దానికి కారణం మరో ఆప్షన్ లేక. ఉన్నవాళ్ళందరూ స్టేల్ అయిపోయి, శ్రీ లీల కంటికి నదురుగా కనిపించిన ముద్దుగుమ్ముడు కావడం మరో ముఖ్యమైర కారణం.
బెంగుళూరులో సెటిల్ తెలుగు ఫ్యామిలీకి చెందిన శ్రీ కన్నడలో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేయడం, పక్కపక్కనే తెలుగులో చేయడంతో వరస సినిమాలతో బిజీగా మారిపోయింది. 2022లో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ కాంబోలో పీపుల్స్ మీడియా బ్యానర్ మీద రూపొందిన ధమాకా సినిమా పెద్ద హిట్ అయి హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి చేరడంతో శ్రీ లీల పేరు మారుమోగిపోయింది. ఇంకేం సక్సెస్ సెంటిమెంటు కూడా కలసిరావడంతో ఆమె హవాకి తిరుగులేకుండా పోయింది. కానీ ఆ తర్వాత విడుదలైన బోయపాటి డైరెక్టోరియల్ స్కందా చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయింది. తర్వాత వచ్చిన బాలక్రిష్ణ స్టారర్ భగవంత్ కేసరి మంచి హిట్ అనిపించుకోవడంతో మళ్ళీ శ్రీ ఊపందకుంది. క్రమంలో వచ్చిన తర్వాతి రెండు సినిమాలు ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినర్ మేన్ రెండిటికి రెండూ దొందే. ఫ్లాప్సే కావడంతో శ్రీ లీల పూర్తిగా ట్రేడ్ లో వీక్ అయిపోయింది. శ్రీ లీలని పెట్టుకోవాలా వద్దా అనే చర్చలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయకూడదనే నిర్ణయానికి శ్రీ కూడా వచ్చేసింది. గుంటూరు కారం కలెక్షన్ల పరంగా రికార్డుగానే నిలబడ్డా ఎందుకో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాకి రావాల్సినంత స్టేటస్ నైతే సాధించుకోలేకపోయింది. ఈ పరుగులో శ్రీ లీల ఎంత బిజీ అయిపోయిందంటే, ఆదికేశవ్ ప్రమోషన్లకి శ్రీ లీల రావాలంటే గుంటూరు కారం షూటింగ్ ఆపుకోవాల్సివచ్చింది.
మొత్తానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా పట్టుమని తెలుగులో పదిసినిమాలు కూడా చేయని కొత్త హీరోయిన్ శ్రీ లీలకి అనుకోని మార్కెట్ రావడం, అంతలోనే వరస ఫ్లాపులు పడిపోవడంతో ఢీలా పడిపోయింది పాపం శ్రీలీల. ఇందులో ఆమె డాన్సింగ్ ఎబిలిటీ మీద డిమాండ్ పెరిగి, ఆమెను ఐటెమ్ సాంగ్స్ చేయమని రిక్వెస్టులు పెరిగిపోయాయి. ఒక పక్కన కెరీర్ ఏమైపోతుందోననే గందరగోళంలో ఉన్న శ్రీకి ఐటెమ్ సాంగ్స్ అంటే భయం పట్టుకుంది. ఇంక అలాగే స్టాంపు పడిపోతుందేమోనన్న భయంతో ఛస్తే ఐటెమ్ సాంగ్స్ చేయనని తెగేసి అందరకీ చెప్పేసింది. మరో పక్క ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువు కూడా శ్రీ లీలకి పెద్ద ఛాలెంజ్ లా మారింది. వస్తే గిస్తే మంచి సినిమా చేద్దాం లేకపోతే ఇంట్లో కూర్చుందాం అనే మైండ్ సెట్ కి వచ్చేసి, ఐటెమ్ సాంగ్స్ కి నో మీద నో చెబుతోంది శ్రీ లీల. మళ్ళీ హిట్ పడేవరకూ శ్రీ కెరీర్ గందరగోళమే.