iDreamPost
android-app
ios-app

సోహైల్- అఖిల్ మధ్య ఏం జరిగింది? అసలు నిజం వారి మాటల్లోనే..

  • Published Feb 03, 2024 | 10:55 PM Updated Updated Feb 03, 2024 | 10:55 PM

Calrty On Akhil- Sohel Issues: అఖిల్- సోహెల్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. కానీ, బిగ్ బాస్ తర్వాత అంతా మారిపోయింది. అందుకు గల కారణాలు వాళ్లే ఓపెన్ గా చెప్పారు.

Calrty On Akhil- Sohel Issues: అఖిల్- సోహెల్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. కానీ, బిగ్ బాస్ తర్వాత అంతా మారిపోయింది. అందుకు గల కారణాలు వాళ్లే ఓపెన్ గా చెప్పారు.

  • Published Feb 03, 2024 | 10:55 PMUpdated Feb 03, 2024 | 10:55 PM
సోహైల్- అఖిల్ మధ్య ఏం జరిగింది? అసలు నిజం వారి మాటల్లోనే..

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ నేమ్ ని, ఫేమ్ ని సరిగ్గా వాడుకుని కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో సయ్యద్ సోహైల్ ర్యాన్ పేరును చేర్చచ్చు. బిగ్ బాస్ తర్వాత చిన్నగా హీరోగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ, హీరోగా సరైన సక్సెస్ అందుకోవడంలో మాత్రం ఇంకా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇటీవల విడుదలైన బూట్ కట్ బాలరాజు చిత్రానికి కూడా ఆడియన్స్ నుంచి అంత రెస్పాన్స్ రాలేదు. ఆ మూవీకి సంబందించి సోహైల్ ఏడుస్తూ బైట్ కూడా రిలీజ్ చేశాడు. అయితే బిగ్ బాస్ తన క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న అఖిల్ కూడా ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో కనిపించకపోవడంపై చాలానే ప్రశ్నలు వచ్చాయి. అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో సోహైల్, అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ లా అందరికీ కనిపించారు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ముగిసిందో ఆ తర్వాత వీళ్లు ఇద్దరూ చిన్నగా దూరమయ్యారు. అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు. అయితే వీళ్లు ఐడ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వారి మధ్య దూరం ఎందుకు వచ్చింది అనే అంశంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. తన సినిమా ప్రమోషన్స్ కి బిగ్ బాస్ సీజన్ వాళ్లు రాకపోవడంపై మాట్లాడుతూ.. అఖిల్ తో గ్యాప్ రావడంపై సోహైల్ కామెంట్స్ చేశాడు. “హారిక వాళ్ల ఇల్లు షిఫ్ట్ చేసింది అక్కడ ఉంది. లాస్య నేను రాలేను సోహైల్ అని మెసేజ్ చేసింది. అఖిల్ అయితే డైరెక్ట్ గా మెసేజ్ పెట్టాడు. నేను ఇప్పుడు నీతో మాట్లాడే స్టేట్ ఆఫ్ మైండ్ లో లేను అని చెప్పాడు. లాస్ట్ టైమ్ కాలేజ్ ఈవెంట్ లో కలిసినప్పుడు రేయ్ బయటకు వెళ్దాం.. లంచ్ కి వెళ్దాంరా అని చెప్పాను.

వాడు ఇంటికి వెళ్తున్నాను పని ఉంది అని చెప్పాడు. కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్లలేదు.. వాడికి ఇక్కడ రూమ్ ఉంది. అక్కడికి వెళ్లాడు. ఫొటోలు స్టోరీ చూసిన తర్వాత తెలిసింది. వాడు అన్ కంఫర్ట్ ఫీలవుతున్నాడు అనుకున్నాను. తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అవన్నీ ఎవరికీ కనిపించవు. తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. నేను మాట్లాడే స్టేట్ ఆఫ్ మైండ్ లో లేను అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ మెసేజ్ పెట్టాడు. నేనేం చేయాలి దానికి. అడుక్కోవాలా రారారా అని. నేను బాగానే ఉన్నాను. వైజాగ్ ట్రిప్ కూడా నేనే కదా ప్లాన్ చేసింది. ఆయన పర్సనల్ డిస్టబెన్స్ వల్ల నా మీద ఇలా అయ్యిందా ఏమో నాకు తెలీదు. కానీ, కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం” అంటూ సోహైల్ చెప్పుకొచ్చాడు.

గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ కూడా సోహైల్ తో ఇష్యూస్ పై ఓపెన్ కామెంట్స్ చేశాడు. “హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్.. ఫ్రెండ్ షిప్ ఉంటే నేను చెప్తాను. బిగ్ బాస్ లో ఉన్నది మొత్తం జెన్యూన్. కానీ, ఇప్పుడు అలా లేదు. బెస్ట్ ఫ్రెండ్ పొజిషన్ ఒక్కరికే ఉండాలని కోరుకుంటాం. కానీ, నిలబెట్టుకోవాలి కదా అతను. అలా వర్క్ చేయాలి కదా. ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది. మాట్లాడుతున్నాం అంటే ఫ్రెండ్ అని చెప్తాం. ఎవరైతే నా మెంటల్ హెల్త్ గురించి పట్టించుకుంటున్నారో.. ఎవరైతే నా కెరీర్ గురించి కేర్ తీసుకుంటున్నారో.. నా ఫ్యామిలీ గురించి కేర్ చేస్తున్నారు వారిని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. లేనప్పుడు అది ఎందుకు సృష్టించాలి. నా సైడ్ నుంచి చాలా ఉండేది.

ఎంత ఎఫర్ట్స్ పెట్టినా.. అది తప్పకుండా రెండు వైపుల నుంచి ఉండాలి. ఎవరు మీ లైఫ్ లో ఉంటారో వాళ్లే ఉంటారు. డిస్టబెన్స్ ఏం లేదు. ఆ టైమ్ కి అప్పటికే వదిలేస్తాను. కాలేజ్ ఈవెంట్ లో కలిసినప్పుడు నేను కూడా హ్యాపీ ఫీలయ్యాను” అంటూ అఖిల్ సార్ధక్ చెప్పుకొచ్చాడు” వీళ్ల ఇద్దరి మాటలు చూసిన తర్వాత వారి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేయలేకపోవడం, కెరీర్లో ఇద్దరూ బిజీ కావడం మాత్రమే కారణంగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం వీళ్లిద్దరు కలిసి మళ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ లా మారితే చూడాలి అనుకుంటున్నారు. మరి.. సోహైల్- అఖిల్ మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş