iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి ఉర్ఫీ ఎంగేజ్‌మెంట్‌!.. ఆ వ్యక్తి ఎవరు?

  • Published Oct 06, 2023 | 9:06 PM Updated Updated Oct 06, 2023 | 9:06 PM
  • Published Oct 06, 2023 | 9:06 PMUpdated Oct 06, 2023 | 9:06 PM
ప్రముఖ నటి ఉర్ఫీ ఎంగేజ్‌మెంట్‌!.. ఆ వ్యక్తి ఎవరు?

తన విచిత్రమైన వేష ధారణ కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు నటి ఉర్ఫీ జావెద్‌. సోషల్‌ మీడియాలో ఆమె వీడియోలు తరచుగా ట్రెండింగ్‌లోకి వస్తూ ఉంటాయి. ఆ వీడియోల కారణంగా ఆమె విమర్శల పాలు సైతం అవుతూ ఉంటారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న ఉర్ఫీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటో ఉర్ఫీ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటో అన్న ప్రచారం జరుగుతోంది.

 ఈ ఫొటోను ఉర్ఫీ సోదరి ఉరుసా తాజాగా, తన సోదరి ఉర్ఫీ జావెద్‌కు సంబంధించిన ఓ ఫొటో తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో ఉ‍ర్ఫీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి ఉన్నాడు. హిందూ సంప్రదాయంలో జరిగిన ఆ పూజా కార్యక్రమం.. నిశ్చితార్థ కార్యక్రమంగా తెలుస్తోంది. ఉర్ఫీ ఓ హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్‌ నడుస్తోంది. అయితే, ఆ ఫొటోలో ఉన్న అబ్బాయి ముఖాన్ని కనిపించకుండా ముఖానికి లవ్‌ సింబల్‌ తగిలించారు ఉరుసా.

ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉర్ఫీ తనకు కాబోయే వాడి గురించి ఇప్పుడే ప్రపంచానికి తెలియకూడదని భావిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాగా, ఉర్ఫీ జావెద్‌ పలు టీవీ సీరియళ్లతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. గతంలో ఆమె పరాస్‌ కల్నావత్‌ అనే నటుడితో రిలేషన్‌లో ఉన్నారు. మరి, ఉర్ఫీ జావెద్‌కు పెళ్లయిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş