iDreamPost
android-app
ios-app

ఇప్పట్లో షారుఖ్ తో మరో సినిమా లేదన్న అట్లీ

  • Published Feb 24, 2024 | 3:01 PM Updated Updated Feb 24, 2024 | 3:01 PM

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనితో ఇప్పుడు షారుఖ్ - అట్లీ కాంబినేషన్లో మరో సినిమాను కోరుకుంటున్నారు అభిమానులు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనితో ఇప్పుడు షారుఖ్ - అట్లీ కాంబినేషన్లో మరో సినిమాను కోరుకుంటున్నారు అభిమానులు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 24, 2024 | 3:01 PMUpdated Feb 24, 2024 | 3:01 PM
ఇప్పట్లో షారుఖ్ తో మరో సినిమా లేదన్న అట్లీ

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ తో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాక ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ జవాన్. కింగ్ ఖాన్ షారుఖ్ ను ఏ దర్శకుడు కూడా చూపించని తీరులో మాస్ అవతార్ లో చూపించి అభిమానులను ఉర్రూతలూగించాడు అట్లీ. దాంతో మళ్ళీ షారుఖ్ – అట్లీ కాంబినేషన్లో మరో సినిమా కావాలని షారుఖ్ అభిమానులు కోరుకున్నారు.

ఆ అంచనాలకు తగ్గట్టే త్వరలో అట్లీ మళ్ళీ షారుఖ్ తో కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయమై ఇటీవలి ఓ మీడియా ఇంటరాక్షన్ ప్రశ్నించగా.. షారుఖ్ తో ఓ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని, కానీ ప్రస్తుతానికి కాదని వెల్లడించారు. ‘షారుఖ్ సార్ కోసం నేను ఇంకా స్క్రిప్ట్ రాయలేదు. ఒకసారి కథ కుదిరాక ఆయన్ను సంప్రదిస్తాను” అన్నారు అట్లీ. ఇదిలా ఉంటే అట్లీ నిర్మాతగా మారి వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ సినిమా తీశారు. కాగా ఈ సినిమా తమిళ్ లో విజయ్ తో అట్లీ తీసిన తేరి సినిమాకి రీమేక్. ఈ స్టార్ డైరెక్టర్ తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో నెక్ట్స్ ఏ పెద్ద హీరోని డైరెక్ట్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తారన్న పుకార్లు వచ్చినా అవి నిజం కాలేదు.

అటు షారుఖ్ కూడా డంకీ సినిమా తరువాత తదుపరి సినిమాని ప్రకటించలేదు.. ఇద్దరూ ఖాళీయే కాబట్టి జవాన్ 2 సినిమా తీస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. వారు ఈ కాంబో కోసం అంతగా ఆరాట పడటంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కు జవాన్ సినిమాతో ఒక అద్భుతమైన మాస్ ఎంటర్ టైనర్ ను ఇచ్చారు అట్లీ. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లకు షారుఖ్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio