iDreamPost
android-app
ios-app

డేటింగ్‌కు పులుస్టాప్‌.. త్వరలో తమన్నా పెళ్లి!!

  • Published Nov 15, 2023 | 11:09 AM Updated Updated Nov 15, 2023 | 11:09 AM

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో డేటింగ్‌ వార్తలకు పులుస్టాప్‌ పెట్టనున్నారట. ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారట.

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో డేటింగ్‌ వార్తలకు పులుస్టాప్‌ పెట్టనున్నారట. ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారట.

  • Published Nov 15, 2023 | 11:09 AMUpdated Nov 15, 2023 | 11:09 AM
డేటింగ్‌కు పులుస్టాప్‌.. త్వరలో తమన్నా పెళ్లి!!

మిల్కీ బ్యూటీ తమన్నా.. నటుడు విజయ్‌ వర్మ గత కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి డేటింగ్‌ విషయం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరూ తరచుగా ఏదో ఒక చోట జంటగా దర్శనమిస్తూ.. మీడియాకు సోషల్‌ మీడియాకు పని చెబుతున్నారు. నిత్యం వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తోంది. తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఓ పుకారు సినిమా సర్కిల్‌లో షికారు చేస్తోంది. త్వరలో వీరిద్దరూ డేటింగ్‌కు పులుస్టాప్‌ చెప్పనున్నారట. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమన్నా ఇంట్లో పెళ్లి విషయంలో ఒత్తిడి పెరగటంతో ఈ జంట పెళ్లికి సిద్ధమైందని టాక్‌.

అన్నీ సెట్‌ అయితే వచ్చే ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారట. ఇందుకు సంబంధించిన అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ త్వరలో రానుందట. ఇక, ఇవి కేవలం పుకార్లే అయినా.. మొన్న దీపావళి పండుగను ఇద్దరూ కలిసి జరుపుకోవటం.. ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా, తమన్నా మొదటినుంచి వివాదాలకు, లవ్‌ ఎఫైర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, అనుకోని విధంగా లస్ట్‌ స్టోరీస్‌ 2 నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. కొంత కాలం వీరి ప్రేమ వ్యవహారం సీక్రెట్‌గా సాగింది. డేటింగ్‌ వార్తలు ఎక్కువవటంతో ఇద్దరూ ఓపెన్‌ అవ్వకతప్పలేదు.

తమన్నా సినిమా కెరీర్‌ విషయానికి వస్తే..

2005లో వచ్చిన ‘‘చాంద్‌ సే రోషన్‌ కెహ్రా’’ అనే హిందీ సినిమాతో నటనా రంగంలోకి అడుగుపెట్టారు. 2006లో వచ్చిన శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరం కేడి సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు,తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 18 సంవత్సరాలు పైనే అవుతోంది.

విజయ్‌ వర్మతో లవ్‌ ఎఫైర్‌ తర్వాతే ఆమె పేరు మారుమోగుతోంది. తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తమన్నా ప్రస్తుతం ‘అరన్‌ మణి 4’ అనే తమిళ సినిమాలోనూ.. వేద అనే హిందీ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. తమన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వెబ్‌ సిరీస్‌పై కూడా దృష్టిపెట్టారు. ఓటీటీ కంటెంట్‌ విషయంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే లస్ట్‌ స్టోరీస్‌ 2 తో పాటు పలు ఓటీటీ కంటెంట్‌కు ఓకే చేశారు. మరి, మిల్కీ బ్యూటీ తమన్నా.. నటుడు విజయ్‌ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet