iDreamPost
android-app
ios-app

ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న ‘జగతి మేడం’.. ఒక్క హింట్‌తో క్లారిటీ!

  • Published Jul 31, 2023 | 8:56 AM Updated Updated Jul 31, 2023 | 8:56 AM
  • Published Jul 31, 2023 | 8:56 AMUpdated Jul 31, 2023 | 8:56 AM
ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న ‘జగతి మేడం’.. ఒక్క హింట్‌తో క్లారిటీ!

ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో విడాకులు, రెండో పెళ్లి వంటి విషయాలు సర్వ సాధారణం అయ్యాయి. అన్ని నచ్చితే బంధంలో కొనసాగుతున్నారు.. లేదంటే ఆ రిలేషన్‌కి గుడ్‌బై చెప్పి.. బయటకు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత నచ్చితే మరో వివాహం చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో.. ప్రేమ, పెళ్లి వార్తలతో వార్తల్లో నిలిచింది బుల్లితెర నటి జ్యోతి రాయ్‌. పేరు వింటే గుర్తు పట్టడం కష్టం.. అదే గుప్పెడంత మనసు సీరియల్‌ జగతి మేడం అంటే.. వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు పడతారు. ఈ సీరియల్‌లో స్వతంత్ర భావాలతో.. ఎంతో ఆత్మాభిమానం గల మహిళగా.. కొడుకు ప్రేమ కోసం పరితపించే తల్లిగా.. తన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

సీరియల్‌లో ఆమె కట్టు, బొట్టు చూస్తే ఎంతో హుందాగా.. పద్దతికే చీర కట్టినట్లుగా అనిపిస్తుంది. అదంతా తెర మీదే. ఇక రియాలిటీలో మాత్రం.. ఫుల్‌ మోడ్రన్‌ మేడం. ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌లు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా జ్యోతిరాయ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. జగతి మేడం సీక్రెట్‌గా రెండో వివాహం చేసుకుందట.. అది కూడా వయసులో తన కంటే చిన్నవాడిని. పైగా దీని గురించి ఆమె హింట్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

జ్యోతి రాయ్‌ గత కొంత కాలంగా ఓ యంగ్‌ డైరెక్టర్‌తో లవ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడే సుకుపుర్వాజ్‌. వీరిద్దరూ కలిసి.. ప్రేమ పక్షుల్లాగా చెట్టాపట్టాలేసుకుని విహరించడమే కాక.. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. తమ బంధం గురించి ఓ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి రాయ్‌ చేసిన పోస్ట్‌తో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతి రాయ్‌ ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. గ్లామర్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇక తాజాగా జగతి మేడం ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. అందేంటంటే..

తాజాగా జ్యోతి రాయ్.. జ్యోతి పుర్వాజ్ అని పేరుతో ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె పేరు జ్యోతి రాయ్ కాగా.. ఆమె ప్రియుడు పేరు సుకుపుర్వాజ్.. ఈ రెండు పేర్లు కలపి జ్యోతి పుర్వాజ్ అని పేరు పెట్టుకున్నట్లు అర్థం అవుతోంది. వాస్తవానికి ఆడవాళ్లు.. పెళ్లైన తరువాత పేరు చివర భర్త పేరు పెట్టుకుంటారు. ఆ రకంగా చూస్తే జ్యోతి రాయ్‌కి సుకుపుర్వాజ్‌కి పెళ్లైపోయినట్లే అంటున్నారు నెటిజనులు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. దీని గురించి ఆమె అధికారికంగా వెల్లడించాలి.

ఇక ఇదిలా ఉంటే.. జ్యోతి రాయ్‌ 20 ఏళ్ల వయసులోనే నెట్‌వర్కింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలు కూడా ఉన్నారు. చాలా ఏళ్లుగా వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. తాజాగా జ్యోతి రాయ్.. దర్శకుడు సుకుపుర్వాజ్‌తో ప్రేమలో పడిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడైతే ఏకంగా సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక సుకుపుర్వాజ్‌.. ‘ఏ మాస్టర్ పీస్’ ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş