iDreamPost
android-app
ios-app

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మకి రూ.6 కోట్లు విలువైన కారు గిఫ్ట్‌ !

  • Published Jan 31, 2024 | 11:31 AM Updated Updated Jan 31, 2024 | 11:47 AM

Prasanth Varma: హనుమాన్‌ సినిమాతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు..

Prasanth Varma: హనుమాన్‌ సినిమాతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 11:31 AMUpdated Jan 31, 2024 | 11:47 AM
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మకి రూ.6 కోట్లు విలువైన కారు గిఫ్ట్‌ !

హనుమాన్ సినిమాతో పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా లాంటి చిన్న హీరోతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హనుమాన్‌ సినిమా కన్నా ముందు ప్రశాంత​ వర్మ.. అ!, కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. కానీ హనుమాన్‌ సినిమాతోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు, సక్సెస్‌, లాభాలు వచ్చాయి. అంతేకాక హనుమాన్‌ సినిమా తర్వత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 12 మంది సూపర్‌ హీరోలు వస్తారని చెప్పుకొచ్చాడు. హనుమాన్‌ విజయంతో దీని తర్వాత వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో కూడా ఓ రేంజ్‌లో ఆసక్తి పెరిగింది.

ఇదిలా ఉండగా తాజాగా హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. హనుమాన్‌ విజయంతో ఒక్కసారిగా ఈ యంగ్‌ డైరెక్టర్‌ క్రేజ్‌ పెరిగింది. అంతేకాక హనుమాన్‌ సినిమా దర్శకనిర్మాతలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో సినిమా ఘన విజయం సాధించడంతో.. ప్రశాంత్‌ వర్మకు.. నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారట. దీని విలువ ఏకంగా ఆరు కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన నెటిజనులు.. ప్రశాంత్‌ వర్మకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

ఇక హనుమాన్‌ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటికే ఈ మూవీ.. 250 కోట్లు కలెక్షన్స్ రాబట్టి.. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఇంక హనుమాన్‌ మ్యానియా కొనసాగుతుంది. నైజాంలో ఇప్పుడు చిత్రానికి డిమాండ్‌కు తగ్గ థియేటర్లు లభిస్తున్నాయి. ఉత్తరాదిలోనూ హనుమాన్‌ ఇంకా నడుస్తోంది. ప్రస్తుతుం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారట.

జైహనుమాన్‌ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే జైమనుమాన్‌ సినిమాలోని కీలక పాత్రల కోసం తాను మహేష్‌ బాబు, చిరంజీవిలను ఊహించుకున్నానని.. త్వరలోనే వారిని కలిసి కథ చెబుతానని చెప్పాడు. మరి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ప్రశాంత్‌ వర్మ ఆఫర్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet