iDreamPost
android-app
ios-app

అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడా.. అందరి ముందు లీక్ చేసిన శ్రీముఖి!

  • Published Feb 09, 2024 | 3:43 PM Updated Updated Feb 09, 2024 | 3:43 PM

బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఈ జంట వాలంటైన్స్ డే సందర్భంగా ఓ షోకు హాజరయ్యారు. అక్కడ వీరిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపడింది.

బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఈ జంట వాలంటైన్స్ డే సందర్భంగా ఓ షోకు హాజరయ్యారు. అక్కడ వీరిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపడింది.

  • Published Feb 09, 2024 | 3:43 PMUpdated Feb 09, 2024 | 3:43 PM
అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడా.. అందరి ముందు లీక్ చేసిన శ్రీముఖి!

బుల్లితెర నటి తేజస్విని గౌడ, అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. పలు సిరియల్స్ లో  వీరిద్దరూ నటించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక వీరిద్దరూ రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో భార్య భర్తలుగా మారిన సంగతి తెలిసిందే. కాగా,గతేడాది అమర్ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్ట్ గా పాల్గొని రన్ రప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమర్, అతని కుటుంబ సభ్యులు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో మొదటి సగం రోజులు సైలెంట్ గా ఉన్న అమర్.. ఆ తర్వాత పెద్ద హంగామానే చేశాడు. దాని వల్ల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో ఒక రకంగా ఆయనికి పబ్లిసిటీ పెరిగి, రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే తేజస్విని కూడా ఒక పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరోపక్క కన్నడ పరిశ్రమల్లో పలు షోలలో అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంట త్వరలో రాబోతున్న వాలంటైన్స్ డే సందర్భంగా.. శ్రీముఖి హోస్ట్ చేస్తున్నా ఓ షోకి హాజరయ్యారు. అక్కడ వీరిద్దరికి సంబంధించిన షాకింగ్ విషయం బయటపెట్టింది. ఇంతకి అదేమిటంటే..

బిగ్ బాస్ షో తర్వాత అమర్ దీప్ అతని సతిమణి తేజస్విని గౌడ తాజాగా యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నా ఓ షోకి హాజరయ్యారు. అయితే త్వరలో రాబోతున్న వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఈ షోకు అమర్, తేజ్ లతో పాటు అక్కడ పలువురు రియల్ జంటలైన సిద్దు, విష్ణుప్రియ.. అలాగే కార్తిక దీపం హీరో నిరుపమ్ అతని భార్య మంజుల కూడా హాజరయ్యారు. కాగా, ఈ జంటలతో శ్రీముఖి కొన్ని గేమ్స్ తో పాటు బాగా రోమాన్స్ కూడా చేయించింది. అందుకు సంబంధించిన ఈ షో ఎపిసోడ్ వాలంటైన్స్ డే రోజున టెలికాస్ట్ కానుండడంతో రొమాన్స్ పై ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరిద్దరు కలిసి చాక్లెట్ తినడం.. డ్యాన్స్ చేయడం లాంటివి చేశారు. ఇక అమర్ దీప్, సిద్ధూ, నిరుపమ్ తమ భార్యలకు జడలు వేయడం.. ఎత్తుకోవడం లాంటి చిలిపి పనులు కూడా చేశారు. అలాగే ఈ షోలో ముక్కు అవినాష్ వేసే జోకులు అయితే కడుపు ఉబ్బా నవ్వించాయి. ఇక ఇందులో భాగంగానే.. శ్రీముఖి ఒక్కో జంట గురించి చెబుతూ జోకులు వేసింది. అలాగే అమర్ దీప్, తేజస్విని గురించి మాట్లాడుతూ.. త్వరలో వీరికి బేబీ రాబోతోంది.. తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ అందరి ముందు లీక్ చేసింది. దీంతో శ్రీముఖి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అమర్ దీప్, తేజస్విని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి శ్రీముఖి అన్నమాటల్లో నిజమెంతో చూడాలి. ఇక బుల్లితెరపై నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న అమర్ కు బిగ్ బాస్ తో మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. దీంతో వెండి తెరపై కూడా వెలగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమర్ దీప్ ఇటీవలే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అమర్ జోడిగా సురేఖ వాణి కుమార్తె సుప్రీతా హీరోయిన్ గా నటిస్తోంది. మరి, త్వరలోనే అమర్, తేజస్విని తల్లిదండ్రులు కాబోతున్నారనే వర్తా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet