iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది అనూహ్యంగా హీరోయిన్ అయ్యి.. టాప్ హీరోలనే డామినేట్ చేస్తోంది

  • Published Sep 04, 2024 | 4:23 PM Updated Updated Sep 04, 2024 | 4:23 PM

యోగసనాలు వేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? అనూహ్యంగా హీరోయిన్ అయ్యి.. టాప్ హీరోలనే డామినేట్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా నాలుగు ఇండస్ట్రీల హీరోలతో వర్క్ చేస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

యోగసనాలు వేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? అనూహ్యంగా హీరోయిన్ అయ్యి.. టాప్ హీరోలనే డామినేట్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా నాలుగు ఇండస్ట్రీల హీరోలతో వర్క్ చేస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Sep 04, 2024 | 4:23 PMUpdated Sep 04, 2024 | 4:23 PM
ఈ చిన్నది అనూహ్యంగా హీరోయిన్ అయ్యి.. టాప్ హీరోలనే డామినేట్ చేస్తోంది

ఈ ఫోటోలో మధ్యలో యోగసనాలు వేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? బరిలో దిగిందంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. గొప్ప మహిళా క్రీడాకారిణీగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఈ చిన్నారి అనూహ్యంగా రూటు మార్చుకుంది. తానొకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందని.. స్పోర్ట్స్ ఉమెన్ కావాల్సింది.. యాక్టర్ అయ్యింది. ఇప్పుడు వరుస స్టార్ హీరోలను మడతపెట్టేస్తుంది. ఇంతకు ఆ క్యూటీ ఎవరంటే చూపులతోనే రఫ్పాడించే రితికా సింగ్. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సాలా ఖదూస్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటి.. స్వతహాగా కిక్ బాక్సర్. చిన్నతనం నుండి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంది. తండ్రి మార్గదర్శకత్వంలో కిక్‌బాక్సర్‌గా మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా శిక్షణ పొందింది. ఆమె సూపర్ ఫైట్ లీగ్‌లో పార్టిసిపేట్ చేసింది. కానీ ఊహించిన విధంగా నటిగా మారిపోయింది.

మాధవన్ హీరోగా వచ్చిన ఇరుడి సుట్రు మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఫైటర్.. తొలి మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది బైలింగ్వల్ మూవీగా తెరకెక్కడంతో హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టినట్లయ్యింది. దీన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా గురు పేరుతో తెరకెక్కించగా.. ఇక్కడ కూడా ఆమెనే నటించింది. ఈ సినిమాతో మూడు ఇండస్ట్రీలను చుట్టేసింది ఈ బ్యూటీ. గురూ సినిమా హిట్ అవ్వడంతో రితికాకు మంచి క్రేజ్ వచ్చింది కానీ అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో ఫోకస్ పెంచింది. విజయ్ సేతుపతి‌తో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే లారెన్స్ సరసన శివలింగ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తెలుగులో గురు తర్వాత నీవెవ్వరో చిత్రంలో నటించింది. ఇది అంతగా ఆకట్టుకోలేదు.

ఓ మై కడవలే చిత్రం కూడా హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక హీరోయిన్‌గా అదరగొడుతూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది. కింగ్ ఆఫ్ కోతలో నటించింది. తమిళంలో ఇన్ కార్, కొలాయ్ చిత్రాలు చేసిన ఆమె.. చాలా మూడేళ్ల గ్యాప్ తర్వాత వలరి అనే చిత్రంతో పలకరించింది. గత ఏడాది వచ్చిన ఈ హారర్ చిత్రం ఓకే అనిపించుకుంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది ఈ సోయగం. ఇప్పుడు రజనీకాంత్ వెట్టియాన్ మూవీలో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫజిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్లతో యాక్ట్ చేసే గోల్టెన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ ఒక్క మూవీతో నాలుగు ఇండస్ట్రీలను కవర్ చేసేస్తుంది. నటనలో టాప్ హీరోలను డామినేట్ చేసే అమ్మడు.. సోషల్ మీడియాలో వర్కౌట్ ఫోటోస్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Ritika Singh (@ritika_offl)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio