iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ టీజర్ లో ఇది గమనించారా! అసలు క్యారెక్టర్ అప్పన్నదే

  • Published Nov 11, 2024 | 3:02 PM Updated Updated Nov 11, 2024 | 3:04 PM

Game Changer Appanna Charector: ఏదేమైనా టీజర్ తర్వాత గేమ్ చెంజర్ సినిమా మీద ఒపీనియన్ మారింది. పాజిటివ్ టాక్ మొదలైంది. అయితే ఈ టీజర్ లో ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను మీరు కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

Game Changer Appanna Charector: ఏదేమైనా టీజర్ తర్వాత గేమ్ చెంజర్ సినిమా మీద ఒపీనియన్ మారింది. పాజిటివ్ టాక్ మొదలైంది. అయితే ఈ టీజర్ లో ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను మీరు కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Nov 11, 2024 | 3:02 PMUpdated Nov 11, 2024 | 3:04 PM
గేమ్ ఛేంజర్ టీజర్ లో ఇది గమనించారా! అసలు క్యారెక్టర్ అప్పన్నదే

గేమ్ చెంజర్ కు హైప్ లేదు.. గేమ్ చెంజర్ కష్టమే.. మరో ఇండియన్ 2 అవుతుంది.. అసలు శంకర్ ఏం చేస్తున్నాడు.. అన్న వారంతా ఇప్పుడు నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఎందుకంటే టీజర్ తర్వాత గేమ్ ఛేంజర్ పై అందరి ఒపీనియన్ మారింది. ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. రెండు రోజులు కాకుండానే 70 మిలియన్ వ్యూస్ దాటేసి ట్రెండింగ్ లో ఉంది. రామ్ చరణ్ అభిమానులంతా ఈ టీజర్ తో ఫుల్ శాటిస్ఫై అయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న మూడు క్యారెక్టర్స్ షేడ్స్ ను చూపించారు. ఆ లుక్స్ కోసమైనా మరోసారి టీజర్ చూస్తున్నారు ప్రేక్షకులు. కాలేజ్ స్టూడెంట్ , ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు కీలకమైన రాజకీయ నాయకుడి రోల్ ని కూడా చూపించేసారు. అయితే రామ్ , రామ్ నందన్ క్యారెక్టర్స్ కంటే కూడా… పొలిటికల్ లీడర్ పాత్రలో చేసిన అప్పన్నదే అసలు వ్యవహారం అంట.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్నగా చరణ్ కు డిజైన్ చేసిన ఎపిసోడ్.. చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఆ క్యారెక్టర్ కు జోడిగా అంజలి నటిచిందన్న సంగతి తెలిసిందే. ఆమెను గిరిజన నృత్య కళాకారిణిగా చూపించారు. దానితో పాటు ఒక సామాజిక సమస్య కోసం అప్పన్న చేసే ఓ పోరాటం ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. మెయిన్ గా అతనిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు.. అతను వారిని ఎదురించే తీరు సినిమా హైలెట్స్ లో ఒకటంట. సరిగ్గా అక్కడే అప్పన్న క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఎండింగ్ ఉంటుందని మరో న్యూస్. ప్యూర్ వింటేజ్ ఎఫెక్ట్ ఈ ఎపిసోడ్ లో ఉండబోతుంది. ఆఫీసర్ గా రామ్ నందన్ చేయబోయే విన్యాసాలన్నిటికి.. అప్పన్న ఇచ్చే ప్రభావం వలన ఎలివేట్ అవుతాయట. అబ్బో ఇలా చాలా విషయాలు సినిమా మీద హైప్ పెంచేస్తున్నాయి. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ గేమ్ ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అనే మాటను టీజర్ కట్ తో ప్రూవ్ చేశాడు శంకర్.

వస్తున్న ఎలివేషన్స్ అన్ని తెరపై ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయట. ఇంకా చెప్పాల్సింది చాలానే ఉన్నా కూడా.. తినబోతూ రుచి ఎందుకు అని మిగతా విషయాలను బయటకు రానివ్వట్లేదట మేకర్స్. ఏదేమైనా ఇప్పుడు గేమ్ ఛేంజర్ మీద ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఏర్పడిందని చెప్పి తీరాల్సిందే .ప్రస్తుతం పుష్ప 2 హడావిడి కొనసాగుతుంది కాబట్టి… అది కాస్త తగ్గిన తర్వాత.. గేమ్ ఛేంజర్ పూర్తి స్థాయి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తారట మేకర్స్. టీజర్ ఏ ఇలా ఉంటె.. ఇక ఆ తర్వాత ట్రైలర్ కట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş